ఇదేందయ్యా ఇది, ఫైన్ వేశారని స్కూటర్ అమ్మి గుర్రం కొన్న యువకుడు..!

మామూలుగా ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ఏదైనా రూల్ ఉల్లంఘిస్తూ పట్టుబడితే ఫైన్ విధిస్తారు.హెల్మెట్ లేని కారణంగా బైకర్లకు ఎక్కువగా ఫైన్ విధిస్తుంటారు.

 Upset Assam Man Sells Scooter To Buy Horse After Police Fine Him For Not Wearing-TeluguStop.com

ఇలాంటి జరిమానాలను తప్పించుకునేందుకు చాలామంది హెల్మెట్ కొనుగోలు చేస్తారు.అయితే అస్సాంకు చెందిన దిబాకర్ కొయిరాలా( Dibakar Koirala ) అనే వ్యాపారవేత్త మాత్రం ఈ ఫైన్ల బాధ భరించలేక ఏకంగా తన స్కూటర్‌ను అమ్మేశాడు.దాన్ని అమ్మేసి రూ.60 వేలకు ఒక గుర్రం కొన్నాడు.ఇప్పుడు అతడు దానిపైనే తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే, ఇటీవల స్కూటర్ హెల్మెట్ ధరించకుండా స్కూటర్( Scooter ) నడుపుతున్నందున ట్రాఫిక్ పోలీసులు దిబాకర్‌కు రూ.500 జరిమానా విధించారు.దాంతో అతడు బాగా కోపానికి గురయ్యాడు.

ఆ కోపంలో ఉన్నప్పుడే తన స్కూటర్‌ను అమ్మి గుర్రాన్ని( Horse ) కొనాలని నిర్ణయించుకున్నాడు.గుర్రం మరింత సౌకర్యవంతంగా, ఖర్చుతో కూడుకున్నదని, దానిని స్వారీ చేయడానికి లైసెన్స్ అవసరం లేదని అతను భావించాడు.

Telugu Assam, Cost Effective, Dibakar Koirala, Fine, Fuel, Helmet, Horse, Scoote

దిబాకర్ రవాణా కోసం గుర్రాన్ని ఉపయోగించడం వైపు మొగ్గు చూపాడు.గడ్డి మేతకు తప్ప పెద్దగా ఖర్చులు ఉండవని, పోలీసుల భయం అసలే ఉండదని ఇతని చెబుతున్నాడు.ల్యాబ్ అసిస్టెంట్ అయిన షేక్ యూసుఫ్( Shaikh Yusuf ) కూడా ఫ్యూయల్ పై డబ్బు ఆదా చేయడానికి గుర్రాన్ని కొన్నాడు.ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు గుర్రపు స్వారీ కూడా మంచి మార్గమని చెప్పారు.

వీరిద్దరూ స్కూటర్లు బైక్‌లను పక్కన పడేసి గుర్రాలపై స్వారీ చేస్తూ వారి ప్రాంతాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.వారు గుర్రపు స్వారీకి హెల్మెట్, పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదన్న కారణంగా గుర్రం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

Telugu Assam, Cost Effective, Dibakar Koirala, Fine, Fuel, Helmet, Horse, Scoote

అయితే ఈ సంగతి తెలిసి నెటిజన్లు ఏందయ్యా ఇది అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఫ్యూయల్ ధర పెరుగుతూనే ఉన్నందున, గుర్రాలను రవాణా మార్గంగా ఉపయోగించడం భారతదేశంలో ఎక్కువ అవుతోంది.2019లో సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్ గుర్రాన్ని సరిగ్గా కట్టుకుని, హెల్మెట్ ధరించి ఉన్నంత వరకు, పబ్లిక్ రోడ్లపై గుర్రపు స్వారీ చేయడాన్ని చట్టబద్ధం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube