మాస్ అవతార్ అంటూ షారుక్ ఖాన్ జవాన్ పై స్పందించిన అల్లు అర్జున్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) తాజాగా అట్లీ (Atlee) దర్శకత్వంలో నటించిన జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Hero Allu Arjun Praises Shah Rukh Khan Jawan Movie,shah Rukh Khan, Jawan Movie,a-TeluguStop.com

అన్ని భాషలలోనూ ఎంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబడుతూ థియేటర్ల వద్ద సునామి సృష్టిస్తుంది.షారుక్ ఖాన్ నయనతార( Nayanthara ) జంటగా నటించినటువంటి ఈ సినిమా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఇప్పటివరకు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందిస్తూ సినీ సెలబ్రిటీలపై ప్రశంసలు కురిపించారు.

ఇప్పటికే మహేష్ బాబు ( Mahesh Babu ) ఈ సినిమా గురించి స్పందిస్తూ లెజెండ్స్ బరిలో దిగితే ఇలాగే ఉంటుంది అంటూ సినిమాపై ఇందులో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా తన రివ్యూని ప్రకటించారు.ఇక తాజాగా నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం జవాన్ సినిమా చూశారని తెలుస్తోంది ఇలా ఈ సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…

జవాన్ సినిమా పూర్తి షారుక్ మాస్ అవతార్ అని, మూవీలో షారుఖ్ స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు బన్నీ రాసుకొచ్చాడు.అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటన గురించి, అనిరుద్ మ్యూజిక్ గురించి ప్రశంసించాడు.ఇక డైరెక్టర్ అట్లీ పై కూడా అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.ఇక గత కొద్ది రోజుల నుంచి అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్( Allu Arjun ) నటించబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.అయితే ఇక జవాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

మరి వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube