హమ్మయ్య... భారత సంతతి యూకే మంత్రికి నెగిటివ్: ఊపిరి పీల్చుకున్న బ్రిటన్ పార్లమెంట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు.సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దీని బారినపడ్డారు.

 India Origin Uk Minister Alok Sharma Tests Negative For Coronavirus, India, Uk M-TeluguStop.com

ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో భారత సంతతి మంత్రి అలోశ్ శర్మకు కోవిడ్ 19 నెగిటివ్‌గా తేలింది.బుధవారం సాయంత్రం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ‘‘ కార్పోరేట్ గవర్నెన్స్, ఇన్‌సాల్వెన్సీ బిల్లుపై హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రసంగిస్తున్న ఆయన నీరసంగా కనిపించారు.

చెమటలు పడుతూ ఏ మాత్రం తగ్గకపోవడంతో కరోనా సోకిందమోనన్న అనుమానంతో అలోక్ శర్మ వైద్య పరీక్షలు చేయించుకుని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.

ఆ ఫలితాల కోసం యావత్ బ్రిటన్ పార్లమెంట్ ఆశగా ఎదురుచూసింది.

ఎందుకంటే ఈ ఓటింగ్‌లో అనేక మంది ఎంపీలతో కలిసి అలోక్ శర్మ పాల్గొనడమే వారి భయానికి కారణం.ఒకవేళ ఆయనకు గనుక పాజిటివ్ వస్తే బుధవారం అలోక్‌కు 2 మీటర్ల దూరంలో ఉన్న వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఆయనకు నిర్వహించిన ఫలితాల్లో నెగిటివ్ రావడంతో కేబినెట్‌తో పాటు ఎంపీలంతా ఊపిరి పీల్చుకున్నారు.గత 24 గంటలుగా తన క్షేమం గురించి ఆందోళన చెందిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తనకు మద్ధతు పలికిన పార్లమెంట్ అధికారులు, స్పీకర్‌కు అలోశ్ శర్మ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

Telugu Britan, Britanprime, India, Uk Alok Sharma, Uk-Telugu NRI

కాగా ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా సోకడంతో వెంటిలేటర్ దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.యూకేలో ఇప్పటి వరకు 2,81,661 మందికి కరోనా సోకగా39,904 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube