అగ్ర‌రాజ్యం పాలిటిక్స్‌లో ట్రంప్ ఇక హిస్ట‌రీనే..!

అది 2016వ సంవ‌త్స‌రం.అమెరికాలో అధ్య‌క్ష పీఠం కోసం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

 Trump Remains History In America Politics, America,presidential Elections,donald-TeluguStop.com

అప్పటి వ‌ర‌కు ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న హిల్ల‌రీ క్లింట‌న్ డెమొక్రాటిక్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్ష బ‌రిలో నిలిచారు.ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు ఈ ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియ‌ని డొనాల్డ్ ట్రంప్ రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున అధ్య‌క్ష బ‌రిలో పోటీకి దిగారు.

కేవ‌లం అమెరికాలో రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ స‌హా సినీ నిర్మాత‌గా, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా మాత్ర‌మే ఉన్న ట్రంప్‌.రాజకీయంగా అడుగు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.

పైగా ఆయ‌న‌పై అక్క‌డి ప్ర‌జ‌లు భారీ ఆశ‌లు పెట్టుకున్నారు.ఎందుకంటే.

ఆయ‌న వినిపించిన స్వ‌జాతి సిద్ధాంతం ఓ రేంజ్‌లో మార్మోగిపోయింది.మెక్సికో దేశం నుంచి అక్ర‌మ వ‌ల‌స‌లు వ‌స్తున్నాయ‌ని.

దీంతో భారీగా స్థానిక ఉద్యోగాలు వారికి ద‌క్కుతున్నాయ‌ని, కాబ‌ట్టి మెక్సికోకు అమెరికాకు మ‌ధ్య గోడ క‌ట్టిస్తాన‌ని ఆయ‌న ఎన్నిక‌ల్లో వాగ్దానం చేశారు.

అదే స‌మ‌యంలో అమెరిక‌న్ల‌కే ఉద్యోగాలు ద‌క్కేలా చ‌ట్టాలు మారుస్తామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కుఅమెరికాను పాలించిన వారు అమెరికాకు ఏం చేశార‌ని కూడా ట్రంప్ ప్ర‌శ్నించ‌డంతో స‌హ‌జంగానే స్థానిక‌త పాలిటిక్స్ మ‌న దగ్గ‌ర మాదిరిగానే అక్క‌డ కూడా బాగానే వ‌ర్కవుట్ అయింది.

దీంతో క్లింట‌న్ కంటే.ట్రంప్ బెట‌ర‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ప‌ట్టం క‌ట్టారు.అంతేకాదు.ఆయ‌న నోటి దురుసు త‌నాన్ని కూడా అక్క‌డివారు ఆ స‌మ‌యంలో మెచ్చుకున్నారు.

హిల్ల‌రీని నానా దుర్భాష‌లాడినా.వారు వినోదించారు.

ఆమె అస‌లు ఆడ‌దేనా ? అని ప్ర‌శ్నించినా.అక్క‌డివారు నొచ్చుకోలేదు.

ఫ‌లితంగా ఓట్లు కుమ్మ‌రించారు.ట్రంప్ గెలిచారు.

నాలుగేళ్లు గిర్రున తిరిగిపోయాయి.ఇప్పుడు మ‌ళ్లీ అధ్య‌క్ష ఎన్నిక‌లు వ‌చ్చాయి.

ఈ ఏడాది న‌వంబ‌రు నాలుగున అధ్య‌క్ష పీఠానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో నాలుగేళ్ల ట్రంప్ పాల‌న‌పై అమెరిక‌న్ల మ‌నోగతం ఎలా ఉంది ? 2016లో చూపించిన దూకుడు ట్రంప్ కొన‌సాగించారా ?  ఆయ‌న ఏవిధంగా అమెరిక‌న్ల మ‌న‌సు దోచుకున్నారు ? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తే.అత్యంత వివాదాస్ప‌ద అధ్యక్షుడిగా ఆయ‌న నిలిచారు త‌ప్పితే.ఎక్క‌డా అమెరిక‌న్ల‌కు ఆయ‌న ఇచ్చిన మాట‌ల‌ను నిల‌బెట్టుకోలేక పోయార‌నే చెప్పాలి.వీసాల ర‌ద్దును ప్ర‌క‌టించారు.ఆవెంట‌నే వెన‌క్కి తీసుకున్నారు.

మ‌రీ ముఖ్యంగా చైనా వంటి దేశంతో ఆయ‌న చిచ్చుకు ప్ర‌య‌త్నించ‌డం.అమెరిక‌న్ల‌లోనూ అస‌హ‌నానికి గురైంది.

Telugu America, Donald Trump, Joe Bidden, Presidential-Telugu Political News

ఇక‌, న‌ల్ల‌జ‌తీయుల‌ను తొక్కేయ‌డం ద్వారా తాను మ‌రోసారి అధికారాన్ని ప‌దిలం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా.తెల్ల‌జాతి వారి నుంచే వ్య‌తిరేక‌త వ‌చ్చింది.ఇక‌, ఇప్పుడు ఆరు మాసాలుగా వేధిస్తున్న క‌రోనా విష‌యంలోనూ ట్రంప్ చేష్ట‌లుడిగి చూస్తున్నారు.ఆదిలోనే క‌రోనాకు అడ్డుక‌ట్ట వేయాల‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మిత్ర దేశాల వ‌ర‌కు కూడా సూచ‌న‌లు చేసినా.

ఆయ‌న ప‌ట్టించుకోకుండా మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం అమెరిక‌న్ల‌కు ఆగ్ర‌హంగానే ఉంది.అదేముంది.చిన్న‌పాటి జ్వ‌రం.మావాళ్లు ఆమాత్రం త‌ట్టుకోలేరా అంటూ.

వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఫ‌లితంగా రెండు ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయే వ‌ర‌కు ప‌రిస్థితిని దిగ‌జార్చారు.

ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు రాగానే ఆయ‌న మ‌రోసారి స్థానికత పాట అందుకున్నా.ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింది.ఒక పారిశ్రామిక వేత్త అమెరికాను లీడ్ చేస్తే.దేశం పూర్వాప‌రాలు మారిపోయి.

ఉద్యోగాలు ద‌క్కుతాయ‌ని ఆశించిన యువ‌త ఆశ‌లు కూడా గ‌ల్లంత‌య్యాయి.ఇలా ఏవిధంగా చూసినా.

త‌న చేష్ట‌లు, మాట‌ల‌తో త‌న ప‌ద‌వికి తానే ఎస‌రు పెట్టుకుంటున్నార‌నే విశ్లేష‌ణ‌లు ట్రంప్‌కు సంబంధించి బాగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.ఇదే జ‌రిగితే.

ట్రంప్ ఓ చ‌రిత్ర‌గా నిలిచిపోతారు త‌ప్ప‌.తిరిగి ప‌ద‌వి చేప‌ట్ట‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube