అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అత్యంత కీలకమైన ప్రచార కమిటీ లో ఓ సభ్యుడిని ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది.ఈ ఘటనతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు.
కొన్ని రోజుల క్రితమే ట్రంప్ రష్యాకి అనుకూలంగా ఉన్నారా అనే అనుమానాలు లేవనెత్తి, ఆ కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని వార్తలు వచ్చిన నేపధ్యంలో తాజాగా ట్రంప్ ప్రచార సభ్యుడిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
ట్రంప్ కీలక ప్రచార సభ్యుడు రోగర్ స్టోన్‌ను కొన్ని క్రిమినల్ కేసుల తో పాటు, సాక్ష్యాలని తారుమారు చేశారు అనే విషయాలతో అరెస్ట్ చేసినట్టుగా ఎఫ్‌బీఐ తెలిపింది.ఈ కేసుల విషయంలో స్పెషల్ కౌన్సిల్, రాబర్ట్ ముల్లెర్ రోగర్ ని విచారణ చేయనున్నారని తెలుస్తోంది.ఇదిలాఉంటే 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉండనే ఆరోపణలు అందరికి తెలిసినవే అయితే.
ఆ సమయంలో డెమోక్రాటిక్ అభ్యర్థి గా హిల్లరీ క్లింటన్‌కు సంబంధించిన వ్యక్తిగత , కీలక రహస్య సమాచారం లీక్ అయ్యిందనే ఆరోపణలు కూడా వచ్చాయి అయితే ఈ లీకుల వెనుకాల రష్యా హస్తం ఉందని కూడా ఆరోపించారు.ఈ క్రమంలోనే ఇప్పుడు రోగర్ ని విచారణ నిమిత్తం అరెస్ట్ చేశారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.ఎఫ్‌బీఐ ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించడం చూస్తుంటే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అంటున్నారు పరిశీలకులు.