గత కొద్దిరోజులుగా ఈడి, ఐటి అధికారుల ముకుమ్మడి దాడులతో వార్తల్లో ఉంటున్న తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు అత్యంత సన్నిహితులైన మంత్రి మల్లారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.అత్యంత సంపన్నమైన వ్యక్తిగా ఆయన టీఆర్ఎస్ లో గుర్తింపు పొందారు.
అనేక మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తూ వస్తున్న మల్లారెడ్డి చాలా కాలంగా టిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తుండడంతో పాటు వార్తల్లోనూ ఉంటున్నారు.ఇటీవల ఐటి అధికారులు మల్లారెడ్డి ఆసులపై దాడులు నిర్వహించారు.
ఇప్పటికీ ఆ దాడులు కొనసాగుతూనే ఉండగా , తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు.
కలలు కన్నాను దాన్ని నిజం చేసుకున్నాను.
నా అంత అదృష్టవంతుడు ఎవడూ లేడని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.తన కొడుకును డాక్టర్ ను చేస్తే, తనకు డాక్టర్ కోడలు గిఫ్ట్ గా వచ్చింది.
రెడ్డి అమ్మాయిని చేస్తే పిక్నిక్ లు , కిట్టి పార్టీలు అంటూ వెళ్లేదని మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని అన్నారు పిల్లలను పిక్నిక్, బర్త్డే పార్టీలు అంటూ తల్లిదండ్రులు చెడగొడుతున్నారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

ఓ కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.తన కొడుకును డాక్టర్ ను చేస్తే తనుకు డాక్టర్ కోడలు గిఫ్ట్ గా వచ్చింది .రెడ్డి అమ్మాయిని చేస్తే పిక్నిక్, కిట్టి పార్టీలో అంటూ వెళ్ళేది అన్నారు.తన కోడలికి అమ్మా, నాన్న లేరని, తాను నాకు మూడో కొడుకు అంటూ మల్లారెడ్డి ఎమోషనల్ అయ్యారు.
ఇక రెడ్డి అమ్మాయి విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఫ్లో లో వచ్చింది అంటూ వివరణ ఇచ్చారు.మొత్తంగా ఏదో ఒక అంశంతో నిత్యం