ఎవరైనా మనకు ఎదురు పడినప్పుడు మాట్లాడకపోతే అది చూసేవారికి అహంకారం ల కనిపిస్తుంది.ఒక చోట కలిసి ఉన్న అసలు పట్టించుకోనట్టు ఉంటె ఇక ఇగోయిస్టు అని పేరు పెట్టేస్తారు.
ఆలా కాస్త వింభిన్నమైన వైఖరి కలిగిన హీరోయిన్ జయ లలిత.ఆమె తమిళ నాడు రాష్ట్రానికి ,ముఖ్యమంత్రి అయినా కూడా ఆమె జీవితం లో ఎదుర్కొన్న బాధలు, కష్టాలు ఆమెను ఒక బండ రాయిని చేసాయి.
ఆమె సినిమాల్లోకి రావాలనుకోలేదు.చక్కగా చదుకునేది.
కానీ ఆమె తల్లి బలవంతం చేయడం తో అనుకోని పరిస్థితిలో ఈ ఊబిలోకి దూకాల్సి వచ్చింది.కానీ సినిమాల్లోకి వచ్చాక ఆమెను చాల వివాదాలు చుట్టుముట్టాయి.
ఆమె తోటి హీరోయిన్స్ కలిసేది కాదు.అది ఆమె స్వభావం ఆ విషయాన్నీ ఎవరు అర్ధం చేసుకోలేదు.ఇక ఎంజీఆర్ తో ప్రేమ కూడా అలాంటిదే.అతడు ఆమెని తన అవసరాల కోసం ప్రేమించాడు.
మారె హీరోతో బంధం ఏర్పడనివ్వలేదు.ఆమె జీవితంలోకి ఎవరిని రానివ్వలేదు.
ఆలా ఆమె ప్రేమ, పెళ్లి అనే బంధాలకు అతడి వల్ల దూరం అయ్యింది.ఇప్పటి వరకు ఆమె జీవితంలో కేవలం తల్లి వల్ల బాల్యం, ఎంజీఆర్ వల్ల యవ్వనం కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో ఆమె మరింత రాటు దేలింది.ఇక ఎప్పుడైతే ఎంజీఆర్ అతడి కోసం ఆమెను రాజకీయాల్లోకి కూడా లాగాడో అప్పుడే ఆమె ఒక శక్తి గా మారడానికి బీజం పడింది.

ఒకానొక దశలో ఎంజీఆర్ సైతం ఆమె అతడ్ని దాటి వెళ్లిపోతుందేమో అని భయపడ్డాడు.అందుకే వీరప్పన్, నెడుంజెళియన్ వంటి వారిని ఆమె పైకి ఉసిగొలిపి తమాషా చూసాడు.వారు ఆమెను బాహాటమగానే ఫోర్త్ రేటెడ్ మనిషి అని, లక్సరీ టాక్సీ అని, పాసింజర్ రైలు అని, దెబ్బతిన్న టౌన్ బస్సు అని వ్యాఖ్యానిస్తూ అవమానించే వారు.ఎంజీఆర్ తర్వాత జయలలితను అణిచివేయడానికి జానకి అతడి వారసురాలిని చేసి నీచమైన వ్యాఖ్యలు చేసిన అన్ని భరించి నిలబడింది.
తనను తాను మలుచుకుంది.చివరికి శశి కల అనే చేదు సావాసం కారణంగా అనామకంగా కన్ను మూసింది.