అన్ స్టాపబుల్ షోకు పవన్ ను ఒప్పించింది ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

పవన్ కళ్యాణ్ అభిమానులలో కొంతమందికి పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలలో నటించడం ఏ మాత్రం ఇష్టం లేదనే సంగతి తెలిసిందే.రీమేక్ సినిమాలకు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో పవన్ రీమేక్ లకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 Trivikram Requested To Pawan Kalyan Fans Details Here Goes Viral , Trivikram,-TeluguStop.com

అయితే పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన కొంతమంది డైరెక్టర్ డైరెక్షన్ లో రీమేక్ సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తెరి రీమేక్ లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే 2023 జనవరి నుంచి వినోదాయ సిత్తం రీమేక్ షూట్ లో పాల్గొననున్నారని సమాచారం. సముద్రఖని డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో పవన్ పాత్ర నిడివి తక్కువనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్లు కేటాయించారని బోగట్టా.సాయితేజ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో త్రివిక్రమ్ పాత్ర ఉందని తెలుస్తోంది.మరోవైపు అన్ స్టాపబుల్ షొకు పవన్ హాజరు కానుండగా ఈ నెల 27వ తేదీన ఆ ఎపిసోడ్ షూట్ జరగనుంది.పవన్ క్రిష్ ఈ ఎపిసోడ్ కు హాజరు కానున్నారు.హరిహర వీరమల్లు 60 శాతం షూట్ పూర్తి కాగా మిగతా సన్నివేశాలను వీలైనంత వేగంగా పూర్తి చేసి సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అన్ స్టాపబుల్ షోకు క్రేజ్ ఉన్న గెస్ట్ లను పిలిపించడంలో అల్లు అరవింద్ సక్సెస్ అయ్యారు.త్రివిక్రమ్ రిక్వెస్ట్ చేయడం వల్లే పవన్ అన్ స్టాపబుల్ షోకు హాజరు కానుండగా త్రివిక్రమ్ అంటే పవన్ కు ఇంత అభిమానమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube