తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఇక ముందు నుండి ఏ విధమైన ప్రణాళికతో సాగుతారో, టీఆర్ఎస్ పార్టీ స్పీడ్‌కు ఎలా బ్రేకులు వేస్తారో అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో పెద్దబాస్, చిన్నబాస్ చెప్పిందే వేదంగా నడిచేదట.ఏ ఒక్క మంత్రి కూడా వీరికి ఎదురు సమాధానం చెప్పకుండా ఏదో పదవి ఉందా అంటే ఉంది అనేలా ఉండేవారట.ఇలాంటి సమయంలో కారు గుర్తుకు ఈటలకు ఎక్కడ చెడిందో గానీ మొత్తానికి టీఆర్ఎస్ రాజకీయాల్లో అంతర్గతంగా ఉన్న రచ్చ బజారుకెక్కింది.
దీంతో ఈటల కారును వీడటం, బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలు రావడం అంతా చకాచకా జరిగిపోయాయి.ఇకపోతే తన ఎమ్మెల్యే పదవికి నిన్న రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారట.
ఈ నేపధ్యంలో ఢీల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.కాగా బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఈటల గులాభి పార్టీని ఏ విధంగా డ్యామేజీ చేస్తారో అనే ఆసక్తి ప్రస్తుతం ఇక్కడి ప్రజల్లో నెలకొందట.