Sai Pallavi : సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటుందా? మరి అభిమానుల పరిస్థితి ఏంటి?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.

 Tollywood Heeroine Sai Pallavi Quit Movies , Tollywood , Sai Pallavi , Natural B-TeluguStop.com

మరి ముఖ్యంగా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ యూత్ లో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది ఈ బ్యూటీ.ఇక ఈ ముద్దుగుమ్మ అందానికి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నాచురల్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి.కాగా సాయి పల్లవి ఇప్పటివరకు తెలుగులో ఫిదా, లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ, పడి పడి లేచే మనసు, మారి 2 లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇటీవలే గార్గి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెబుతోందా అంటే సినీ వర్గాలలో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.కదా ఇదివరకే సాయి పల్లవి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.

సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అందుకే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.తాజాగా మరొకసారి సాయి పల్లవి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఎందుకంటే సాయి పల్లవి గత సినిమాలు అయినా విరాటపర్వం గార్గి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించింది.

Telugu Natural, Sai Pallavi, Tollywood-Movie

ఎందుకంటే ఆమె తన కెరీర్ ను సినిమాల మంచి ప్రజా సేవలోనే గడపాలని కోరుకుంటోందట.సాయి పల్లవి డాక్టర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం సాయి పల్లవి ఒక ఆసుపత్రి నిర్మిస్తోందని, హాస్పిటల్ పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఆ హాస్పటల్ పూర్తి అయ్యేవరకు సాయి పల్లవి సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

హాస్పిటల్ పూర్తయిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసి తన సమయాన్ని మొత్తం హాస్పిటల్ లోనే ఉండి పేషెంట్స్ ని చూసుకోవడానికి వెచ్చిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే సాయి పల్లవి అభిమానులకు ఇది ఒక చేదు వార్త అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్న సమయంలో ఇలా సినిమాలకు గుడ్ బై చెప్పడం చాలా బాధాకరమని పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube