బ్రహ్మానందం (Brahmanandam) తన ఆత్మ కథను పుస్తకంగా రాసిన సంగతి మనకు తెలిసిందే.నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకంలో ఈయన తన ఆత్మ కథను రాశారు.
తన జీవితంలో జరిగినటువంటి ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగాలు, సినిమాలలోకి రావడం ఇలా అన్ని విషయాల గురించి కూడా బ్రహ్మానందం ఈ పుస్తకంలో తెలియజేశారు.ఇందులో భాగంగా ఈయన నిరుపేద కుటుంబంలో జన్మించారని, తన చదువు(Studies) కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయం చేశారని తెలియజేశారు.
ఇలా చదువు పట్ల నాలో ఉన్నటువంటి ఆసక్తి చదువుకోవాలనే తపన గమనించినటువంటి వాళ్ళు నాకు చదువుకోవడానికి ఎన్నో విధాలుగా సహాయం అందించారని ఈ పుస్తకంలో బ్రహ్మానందం తెలిపారు.అయితే తాను డిగ్రీ వరకు పూర్తీ అయిన తర్వాత ఎం ఏ చేయడం కోసం ఆంధ్ర యూనివర్సిటీకి( Andhra University ) వెళ్లాను.
అక్కడ హాస్టల్ లో ఉండి చదువుకోవాలి హాస్టల్లో ఉండాలి అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని పక్కనే ఒక గది కిరాయికి తీసుకొని ఉండే వాళ్ళమని తెలిపారు.
చదువు కోసం ఎంతోమంది సహాయం చేస్తున్నారు నా అవసరాల కోసమైనా నాకు డబ్బు కావాలి అన్న ఉద్దేశంతోనే తాను ఒక పనిలో చేరానని బ్రహ్మానందం తెలిపారు.కాలేజీకి వెళ్తున్నటువంటి దారిలో లారీలకు పెయింటింగ్(Lorry Painting) వేసే షాపులో తాను చేరానని ఈయన తెలిపారు.వారి దగ్గర సహాయకుడిగా పని చేస్తూ డబ్బు సంపాదించాను.లారీలకు పెయింటింగ్ వేయడం వల్ల నెలకు ఇంత అని డబ్బు ఇచ్చే వారు కాదు ఎంత పని చేస్తే అంత డబ్బు ఇచ్చే వాళ్ళు
అలా నేను అప్పట్లో నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అందుకునే వాడిని ఇదే నా మొదటి సంపాదన (First Earning) అంటూ బ్రహ్మానందం తెలిపారు.ఇలా రెండు సంవత్సరాల పాటు అక్కడ పనిచేస్తూ తన ఎం ఏ పూర్తి చేశానని అనంతరం లెక్చరర్ గా పని చేశానని బ్రహ్మానందం ఈ సందర్భంగా తన పుస్తకంలో రాసినటువంటి ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.