వన్డే వరల్డ్ కప్ లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ ప్రారంభమైంది.ఈ మ్యాచ్ లో గెలుపుపై రెండు జట్లు కన్నేశాయి.
ఆసియా కప్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.అందుకే బంగ్లాదేశ్ పై పైచేయి సాధించడం కోసం భారత్ గట్టి పట్టుదలతో బరిలోకి దిగింది.
బంగ్లాదేశ్ జట్టు( Bangladesh ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఇక భారత జట్టు బౌలింగ్ చేస్తోంది.
వరల్డ్ కప్ లలో బంగ్లాదేశ్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో చూద్దాం.
విరాట్ కోహ్లీ:
బంగ్లాదేశ్ పై అందరికన్నా ఎక్కువ వరల్డ్ కప్ మ్యాచ్ లు అడిగిన భారతీయ బ్యాటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ).2011 నుంచి 2019 వరకు మూడుసార్లు బంగ్లా టైగర్స్ ను కోహ్లీ ఎదుర్కొన్నాడు.వరల్డ్ కప్ లో కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా బంగ్లాదేశ్ పైనే ఆడాడు.మొదటి మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేశాడు.2015, 2019 వరల్డ్ కప్ లలో కోహ్లీ రాణించలేదు.ఓవరాల్ గా బంగ్లాదేశ్ పై కోహ్లీ ఆడిన మూడు మ్యాచ్లలో 129 పరుగులు చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్:
2011లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 175 పరుగులతో మెరిశాడు.ఈ మ్యాచ్లో 14 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు.వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
బంగ్లాదేశ్ పై ఇంత స్కోర్ మరే బ్యాటర్ ఇప్పటివరకు చేయలేదు.ఓవరాల్ గా చూసుకుంటే బంగ్లా పై 177 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ:
2015 లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 137 పరుగులు చేశాడు.2019లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 104 పరుగులు చేశాడు.ఓవరాల్ గా చూసుకుంటే బంగ్లా పై 241 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్:
2019 వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ కు గాయం కావడంవల్ల రాహుల్ ( KL Rahul )జట్టులోకి వచ్చాడు.బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 77 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.

సౌరవ్ గంగూలీ:
2007 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడినప్పటికీ.సౌరవ్ గంగూలీ( Sourav Ganguly ) ఒంటరి పోరాటం చేసి 65 పరుగులు చేశాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఎండ్ లో గోడలా నిలబడ్డాడు.