డెమోక్రాట్లు , రిపబ్లికన్ల మధ్య 'సరిహద్దు' గోడ...!!

అమెరికాలో రోజు రోజుకి సరిహద్దు గోడ వివాదం ముదిరి పాకాన పడుతోంది.వలస దారులని అడ్డుకునే క్రమంలో గోడ కట్టే విషయంలో వచ్చిన తగువు ఇప్పుడు ఏకంగా , డెమోక్రాట్లు ,రిపబ్లికన్ల మధ్య దూరం పెంచుతో గోడ కట్టేలా చేస్తున్నాయి.

 The Wall Between Democrats And Republicans-TeluguStop.com

వారి మధ్య పెరిగిన దూరం ఎన్నో అభిప్రాయ భేదాలకి తావు ఇస్తోంది.ఈ రకమైన పరిస్థితి దేశంలో ఉండటం మంచిది కాదని.

ఒకరికొకరు సహకరించుకోవాలని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదనే కారణంపై స్పీకర్ నాన్సీ పెలోసీ బ్రస్సెల్స్, ఆఫ్గనిస్తాన్ పర్యటనలకు ట్రంప్ అనుమతిని ఇవ్వలేదు.ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా పకటించారు.దాంతో ఇరు పార్టీల మధ్య దూరం మరింత పెరిగిందనే చెప్పాలి.

ప్రస్తుతం ప్రభుత్వంలో పరిస్థితులు అసలు బాగోలేవని అందుకే మీ ప్రయాణానికి అనుమతి ఇవ్వడం లేదని స్పీకర్ నాన్సీకి ట్రంప్ సందేశం ఇచ్చారు.

అంతేకాదు ఎప్పుడైతే ఉద్యోగులు విదులకి హాజరు అవుతారో అపుడు తానూ విదేశీ పర్యటనలకి అనుమతులు ఇస్తానని తెగేసి చెప్పారు ట్రంప్.

అమెరికాలో నెలకొన్న విపత్కర పరిస్థితులని ఎలా ఎదుర్కోవాలో ఇక్కడే ఉంది ఆలోచించి ప్రభుత్వానికి సాయం చేయాలని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని ట్రంప్ సుతిమెత్తగా చురకలు అంటించడంతో డెమొక్రాట్స్ కి మరింతగా ట్రంప్ నిర్ణయాలపై వ్యతిరేకత పెరిగిపోతోంది.మరి ఈ విషయంపై డెమోక్రాటిక్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube