రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కొత్త లాంగ్ టర్మ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.రూ.2025 రీఛార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్లు 200 రోజుల పాటు అన్‌లిమిటెడ్ సేవలను పొందే అవకాశం ఉంది.ముఖ్యంగా, 500 GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో ఈ ప్లాన్ బంపర్ ఆఫర్ లాంటిది.
అయితే, ఈ ఆఫర్ జనవరి 31, 2024తో ముగియనుంది.కాబట్టి, వెంటనే రీఛార్జ్ చేసుకోవడం మంచిది.

ఇక రూ.2025 జియో ప్లాన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.200 రోజుల లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ, 5G యూజర్లకు అన్‌లిమిటెడ్ డేటా, 4G యూజర్లకు రోజుకు 2.5 GB డేటా (మొత్తం 500 GB), అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (అన్ని నెట్‌వర్క్‌లకు), రోజుకు 100 SMSలు లభిస్తాయి.వీటితోపాటు అదనంగా లభించే బెనిఫిట్స్ విషయానికి వస్తే.ప్లాన్‌తో పాటు రూ.2,150 విలువైన కూపన్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.రూ.500 జియో షాపింగ్ కూపన్ యూ ను రూ.2,500 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసినప్పుడు ఉపయోగించవచ్చు.

ఇంకా రూ.150 స్విగ్గీ కూపన్ ను రూ.499 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లకు వర్తిస్తుంది.అలాగే రూ.1,500 ఫ్లైట్ టికెట్ డిస్కౌంట్ ను ఈజీ మై ట్రిప్ ద్వారా బుకింగ్ చేసినప్పుడు లభిస్తుంది.ఈ కూపన్లు MyJio యాప్‌లో అందుబాటులో ఉంటాయి.ఇలాంటి అద్భుతమైన ప్లాన్‌ను మిస్ కాకుండా ఉండాలంటే, త్వరగా మీ జియో నెంబర్‌కి రూ.2025 రీఛార్జ్ చేసుకోండి.ఇకపోతే జియో కొత్త ట్రాయ్ రూల్స్ ప్రకారం ఎంతో ప్రాముఖ్యమున్న రెండు ప్లాన్స్ ను నిలిపివేసింది.