ప్రపంచం కాలుష్య కోరల్లో చిక్కుకుపోకుండా, పర్యావరణ పరిరక్షణకి ఎంతగానో కృషి చేస్తున్న ఓ ఇండో అమెరికన్ యువతి వర్షిణీ ప్రకాశ్ కి అమెరికా లో అరుదైన గౌరవం లభించింది.పర్యావరణ విధానం-2019లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 మంది అత్యంత ప్రభావశీలుల జాబితాలో వర్షిణీ చోటు దక్కించుకుంది.
ఈ మేరకు గ్లోబల్ నెట్ వర్క్ సంస్థ ఒక జాబితా విడుదల చేసింది.వర్షిణీ తల్లి తండ్రులు అమెరికాలోని బోస్టన్‌లో స్థిరపడ్డారు.అయితే అక్కడే పుట్టి పెరిగిన వర్షిణి సన్‌రైజ్ సంస్థకు కో ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.సదరు సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యలపై చైతన్యం కలిగిస్తున్నారు.
అమెరికాలో ఈ సంస్థ ప్రకటించిన ఈ జాబితాలో భారత్ కి చెందిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ , హర్షవర్థన్ చోటు దక్కించుకున్నారు.వారితోపాటు కొంతమంది భారత్ కి చెందిన వాళ్ళు చోటు దక్కించుకోవడం గమనార్హం.