Lady comedian rohini : వంట చేసిన లేడీ కమెడియన్ రోహిణి.. తినలేక పారిపోయిన ఆమె తండ్రి?

బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి.ఈమె పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.రోహిణి మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది నటి.గతంలో తను నటించిన కొంచెం ఇష్టం.కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం తన మాట తీరుతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఆ తర్వాత పలు సీరియల్లలో కూడా నటించింది.ఇక మాటీవీలో శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్ తో తనలోని నటస్వరూపాన్ని కూడా బయటకు పెట్టింది.తర్వాత ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.

 The Lady Comedian Rohini Who Cooked Her Father Ran Away Because She Could Not Ea-TeluguStop.com

ఇక జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ లో ఎన్నో అవార్డులను సంపాదించుకుంది.సీరియల్స్ తోనే కాకుండా తన కెరీర్ లో ఇంకా ఎదగాలని బిగ్ బాస్ వరకు వెళ్ళింది.

కానీ నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది.బిగ్ బాస్ తర్వాత కూడా రోహిణికి అనుకున్నంత అవకాశాలు రాలేదు.కొన్ని సినిమాల్లో నటించిన సరే తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది.ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అవకాశం అందుకుంది.

అందులో తన కామెడీతో బాగా నవ్విస్తూ ఉంటుంది.జబర్దస్త్ తో పాటు ఇతర కామెడీ షో లలో కూడా కనిపిస్తూ ఉంటుంది రోహిణి.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియా ఖాతాలో తన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పెడుతూ బాగా సందడి చేస్తుంది.

ఇక యూట్యూబ్లో తన పేరు మీద ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంది.అందులో తను చేసే ప్రతి వీడియోలను అప్లోడ్ చేస్తుంది.

ఇక ఆ ఛానల్ కి ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు.

అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా స్నేహితులతో అయినా లేకపోతే ఏ పండగ జరిగినా సరే వాటిని సరదాగా వీడియో తీసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా యూట్యూబ్లో మరో వీడియో పంచుకుంది.అందులో తన ఇంట్లో తానే స్వయంగా వంట చేసినట్లు కనిపించింది.

బిర్యానీ, చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూయించింది.ఇక మధ్య మధ్యలో తను తయారైన కాస్ట్యూమ్ గురించి కూడా తెలిపింది.ఇక మధ్యలో తన తండ్రి బయటికి వెళ్తున్నాను అని చెప్పగా.వెంటనే రోహిణి తన తండ్రిని బయటికి వెల్లొదు అని.తను చేసిన చేపల పులుసు తినమని చెప్పటంతో వెంటనే తన తండ్రి.వద్దమ్మో అంటూ భయపడుతున్నట్లు కనిపించాడు.

నాకు ఏ కూర వద్దు అంటూ వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో రోహిణి కాస్త ఫీల్ అయినట్లు కనిపించింది.ఇక చివరికి తాను చేసిన వంట రుచి చూసి తన తండ్రికి కూడా పెట్టింది.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube