తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.క్యాంపు కార్యాలయం వద్ద బలవన్మరణానికి ప్రయత్నించిన మహిళను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కూతురి వైద్యం కోసం తన ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఆమెకు లేదా అని ప్రశ్నించారు.ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలను కలవాలంటే సీఎం జగన్ కు అహంకారం అడ్డు వస్తుందా అని నిలదీశారు.రాష్ట్రంలో సామాన్యులపై వేధింపులు సాగుతున్నాయన్న చంద్రబాబు.
వీటికి ముగింపు ఎప్పుడని ప్రశ్నించారు.







