పార్లమెంట్ ను కుదిపేస్తున్న భద్రతా వైఫల్యం అంశం..!

లోక్ సభలో భద్రతా వైఫల్యంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది.ఈ మేరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.

 The Issue Of Security Failure That Is Collapsing The Parliament..!-TeluguStop.com

ఈ క్రమంలో లోక్ సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు.సభా నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో పార్లమెంట్ సెషన్ ముగిసేంత వరకు సస్పెన్షన్ కొనసాగనుంది.

ఈ మేరకు సస్పెండ్ కు గురైన ఎంపీల్లో టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్ జోతిమణి, రమ్య హరిదాస్ మరియు డీన్ కురియకోస్ ఉన్నారు.కాగా ఉభయసభలు ప్రారంభం కాగానే నిన్న జరిగిన స్మోక్ బాంబ్ ఘటనపై విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.పలుమార్లు వాయిదా పడిన అనంతరం సభలు ప్రారంభమైనప్పటికీ ఎంపీలు ఆందోళనలు చేయడంతో వారిని సస్పెండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube