పార్లమెంట్ ను కుదిపేస్తున్న భద్రతా వైఫల్యం అంశం..!
TeluguStop.com

లోక్ సభలో భద్రతా వైఫల్యంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది.


ఈ మేరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.


ఈ క్రమంలో లోక్ సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు.
సభా నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో పార్లమెంట్ సెషన్ ముగిసేంత వరకు సస్పెన్షన్ కొనసాగనుంది.
ఈ మేరకు సస్పెండ్ కు గురైన ఎంపీల్లో టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్ జోతిమణి, రమ్య హరిదాస్ మరియు డీన్ కురియకోస్ ఉన్నారు.
కాగా ఉభయసభలు ప్రారంభం కాగానే నిన్న జరిగిన స్మోక్ బాంబ్ ఘటనపై విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పలుమార్లు వాయిదా పడిన అనంతరం సభలు ప్రారంభమైనప్పటికీ ఎంపీలు ఆందోళనలు చేయడంతో వారిని సస్పెండ్ చేశారు.