ఆ పని చేసినందుకు ఏకంగా ఆ యూట్యూబ్ ఛానల్ లపై వేటు వేసిన కేంద్రం..!

ఇప్పటికే చైనా యాప్స్ నిషేధించిందిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝళిపించింది.కేంద్రం మరోసారి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్​ ఛానెళ్లపై కొరడా ఝులిపించింది.

 The Center That Hunted Down Those Youtube Channels Together For Doing That Work-TeluguStop.com

మొత్తం 22 యూట్యూబ్​ ఛానెళ్లను బ్లాక్​ చేస్తూ ఏప్రిల్​ 4న ఆదేశాలు జారీ చేసినట్లు.మంగళవారం ప్రకటించింది.

యూట్యూబ్ వీక్ష‌కుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు కొన్ని టీవీ చానెళ్ల లోగోల‌ను కూడా ఈ యూట్యూబ్ చానెళ్లు ఉప‌యోగించుకున్నాయ‌ని పేర్కొన్న‌ది.త‌ప్పుడు థంబ్ నెయిల్స్‌తో ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళ‌ప‌రిచిన‌ట్లు తెలిపింది.

వీటితో పాటు 3 ట్విట్ట‌ర్ అకౌంట్లు, ఒక ఫేస్‌బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్‌సైట్‌ను కూడా కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది.

తాజాగా నిషేధం విధించిన 22 యూట్యూబ్​ ఛానెళ్లలో 18 ఛానెళ్లు మన దేశానికి చెందినవి కాగా.4 ఛానెళ్లు పాకిస్థాన్​కు చెందినవిగా తెలిపింది కేంద్రం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్న పలు సోషల్ మీడియా అకౌంట్స్ .పాకిస్తాన్ నుంచి భారతదేశ వ్యతిరేక తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.మోడీ సర్కార్ నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్ల మొత్తం వ్యూయర్‌షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది.

వీటిలో 18 భారత్ కు చెందినవి కాగా, 4 పాకిస్తాన్‌కు చెందినవి ఉన్నాయి.

Telugu Central, Chanellaz, Channels, Latest, Youtube-Latest News - Telugu

ఇకపోతే, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణాలతో ఇప్పటికే 320 యాప్స్‌ను కేంద్రం నిషేధించింది.ఐటీ రూల్స్​ 2021ను అనుసరించి భారత్​కు సంబంధించిన యూట్యూబ్​ ఛానెళ్లు, ఇతర సామాజిక మధ్యమాల ఖాతాలపై వేటు వేయడం ఇదే తొలిసారి.ఈ యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ భారత సాయుధ బలగాలు, జమ్మూ కశ్మీర్ లాంటి అంశాలపై ఫేక్‌న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube