ఇంటా బయటా మనశ్శాంతి కరువు.. అందుకే ఉన్మాదిగా మారాడా, టెక్సాస్ కాల్పుల నిందితుడి ప్రొఫైల్

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ పాఠశాలలో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్న వార్తతో ప్రపంచం ఉలిక్కిపడింది.ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.

 Texas Shooting Accused Salvador Ramos Faced Bullies In School Had Fraught Home Life , State Of Texas In America, Santos Waldez Jr, Do You Know Who I Am, Salvador Childhood, Salvador Ramos‌-TeluguStop.com

ఈ క్రమంలో నిందితుడు సాల్వాడర్ రామోస్‌ ప్రవర్తన, పాఠశాల విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సహోద్యుగులతో అతను వ్యవహరించే విధానానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అందరూ నిందితుడిని చాలా సైలెంట్‌గా వుంటూ తన పని తాను చేసుకుపోయే కుర్రాడని చెబుతున్నారు.

 Texas Shooting Accused Salvador Ramos Faced Bullies In School Had Fraught Home Life , State Of Texas In America, Santos Waldez Jr, Do You Know Who I Am, Salvador Childhood, Salvador Ramos‌-ఇంటా బయటా మనశ్శాంతి కరువు.. అందుకే ఉన్మాదిగా మారాడా, టెక్సాస్ కాల్పుల నిందితుడి ప్రొఫైల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ మార్చి వరకు ఉవాల్డే ఏరియాలో వెండీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో మేనేజర్‌గా వున్న అతనితో కలిసి పనిచేసిన ఒక యువతి మాత్రం రామోస్‌లో దూకుడు ప్రవర్తనను గుర్తించింది.అమ్మాయిల పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించేవాడని సదరు యువతి చెబుతోంది.‘‘’Do you know who I am?’ అంటూ వారిని బెదిరించడంతో పాటు మహిళలకు అసభ్యకరమైన మెసేజ్‌లను సైతం పంపేవాడని ఆమె ఆరోపిస్తోంది.పార్క్ వద్ద బాక్సింగ్ గ్లోవ్స్‌ వేసుకుని కొందరితో గొడవ పడేవాడని సదరు యువతి చెబుతోంది.

Telugu Salvador Ramos, Texas America, Texassalvador-Telugu NRI

అతని మాజీ స్నేహితుడు శాంటాస్ వాల్డెజ్ జూనియర్ మాట్లాడుతూ.రామోస్ ప్రవర్తన నానాటికీ దిగజారడం ప్రారంభమైందని, అప్పటి వరకు తామిద్దరం ఎంతో సన్నిహితంగా వుండేవారమని చెప్పాడు.ఒకసారి సరదా కోసం కత్తితో తన ముఖాన్ని కత్తిరించుకున్నాడని శాంటాస్ గుర్తుచేశాడు.తొలుత పిల్లి తనను కరిచిందని చెప్పాడని.కానీ తర్వాత తానే కోసుకున్నట్లు తనతో అన్నాడని వాల్డెజ్ పేర్కొన్నాడు.సాల్వాడర్ బాల్యంలో నత్తితో బాధపడేవాడని, అందువల్ల చాలా మంది నుంచి వేధింపులు ఎదుర్కొన్నాడని వాల్డెజ్ చెప్పాడు.

వేధింపుల కారణంగా స్కూల్‌కి వెళ్లాలంటే జంకేవాడని.అందుకే స్కూల్ డ్రాపౌట్‌గానే మిగిలేవాడని మరికొందరు చెబుతున్నారు.

అలాగే ఇంట్లోనే కుటుంబ కలహాలు వుండేవని.ముఖ్యంగా తల్లితో అతనికి క్షణం కూడా పడేది కాదని, అప్పుడప్పుడు వారి ఇంట్లో గొడవలు జరిగేవని ఇరుగు పొరుగు చెబుతున్నారు.

ఇంటా బయటా వేధింపుల కారణంగానే సాల్వాడర్ మానసిక పరిస్ధితిలో మార్పులు వచ్చి ఉన్మాదిలా మారి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube