మూడు రోజులు శవాల మధ్యే ఉన్న హీరో ఆర్య.. కారణమేంటంటే..?

తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోగా ఆర్యకు పేరుంది.కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఆర్యను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

 Life And Love Journey Of Tamil Hero Arya, Bala Direction, Director Jeeva, Life A-TeluguStop.com

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆర్య అకస్మాత్తుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు విజయాలను సొంతం చేసుకున్నారు.కెరీర్ లో అపజయాలు ఎదురైన ప్రతిసారి భారీ సక్సెస్ ను సొంతం చేసుకుని ఆర్య కెరీర్ లో అంతకంతకూ ఎదుగుతున్నారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించానని అదే సమయంలో తనకు ఎంతో ఇష్టమైన ఫుట్ బాల్ కూడా ఆడేవాడినని ఆర్య అన్నారు.తనకు ఇష్టమైన అమ్మాయికి ఎదురుగా వెళ్లి నవ్వితే ఆమె ముఖం తిప్పుకునేదని ఎందుకలా చేస్తున్నావని అడగగా తనకు ఆటలపైనే ఎక్కువగా ఆసక్తి ఉందని మ్యాన్లీనెస్ లేదని ఆ అమ్మాయి కామెంట్లు చేసిందని ఆర్య వెల్లడించారు.

ఆ తరువాత తాను జిమ్ లో చేరానని ఆర్య చెప్పుకొచ్చారు.

కేరళలో ముస్లిం ఫ్యామిలీలో తాను జన్మించానని వ్యాపారం కొరకు చెన్నైకు వచ్చి తన కుటుంబం స్థిరపడిందని ఆర్య తెలిపారు.

Telugu Bala, Jeeva, Arya Struggles, Jamshed, Kearal, Love Journey, Tamil Arya-Mo

నాన్న తాను అమెరికాకు వెళ్లి చదువుకోవాలని కలలు కనేవారని ఆర్య వెల్లడించారు.మొదట తనకు ఒక చిన్న సినిమాలో ఛాన్స్ వచ్చిందని జీవా డైరెక్షన్ లో తెరకెక్కిన 12బి సినిమాలో నటించానని ఆర్య పేర్కొన్నారు.ఒక దశలో యాక్టింగ్ తనకు నరకంలా అనిపించిందని ఆర్య అన్నారు.

Telugu Bala, Jeeva, Arya Struggles, Jamshed, Kearal, Love Journey, Tamil Arya-Mo

ఆ తర్వాత తిట్టిన వాళ్లే తనను మెచ్చుకున్నారని జమ్ షద్ అనే పేరు ఆర్యగా మారిందని ఆర్య తెలిపారు.విష్ణువర్ధన్ డైరెక్షన్ లో అరిందుమ్ అరియామలుం సినిమాలో నటించానని ఆర్య అన్నారు.బాల డైరెక్షన్ లోని సినిమా కొరకు మూడు రోజులు శవాల మధ్య ఉండి అఘోరాలను చూస్తూ కూర్చున్నానని ఆర్య చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube