తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది.ఈ క్రమంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ( Temperatures )నమోదు అవుతున్నారు.
అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.దాంతో పాటు ఉష్ణోగ్రతలు సైతం రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది.
ఈ నేపథ్యంలో సంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ మినహా అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కాగా 13 జిల్లాల్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొంది.రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
దాదాపు మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో వర్షం పడే ఛాన్స్ ఉందని సమాచారం.