కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project )పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై ఇప్పటికే జ్యుడిషియల్ కమిటీ వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) మరో పిటిషన్ దాఖలు చేశారు.అయితే పార్టీ ఇన్ పర్సన్ కు న్యాయస్థానం అనుమతి ఇవ్వలేదు.
అనంతరం పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు( Telangana High Court ) వచ్చే నెలకు వాయిదా వేసింది.