స్పై మూవీ రివ్యూ...

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్( Nikhil Siddhartha ) .గత ఏడాది విడుదల అయిన కార్తికేయ 2 అనే సినిమాతో మంచి విజయాన్ని అందున్నాడు.

 Spy Movie Review Nikhil Siddhartha , Spy Movie , Spy Movie Review , Tollywood ,-TeluguStop.com

ఆ సినిమా తర్వాత18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌ తోను అలరించాడు .ఇక ఈ సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రం స్పై .పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘స్పై( Spy movie )’ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి .స్వాత్యంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యం ఆధారంగా ఈ మూవీను తెరకెక్కించడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది .తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం భాషల్లో ఈ సినిమా నేడు గ్రాండ్ గా విడుదల అయింది .మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది .నిఖిల్ స్పై తో మరో విజయాన్ని దక్కించుకున్నాడా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం .

ముందుగా కధ విషయానికి వస్తే .

 Spy Movie Review Nikhil Siddhartha , Spy Movie , Spy Movie Review , Tollywood ,-TeluguStop.com
Telugu Iswarya Menon, Niitin Mehta, Rana, Spy, Spy Review, Subhaschandra, Tollyw

అజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, లక్షాలది మంది సామాన్యులను సైనికులుగా తయారుచేసి, వారిలో యుద్ధ స్ఫూర్తిని నింపిన సుభాష్ చంద్రబోస్( Subhas Chandra Bose ).యుద్ధ సమయంలో విమాన ప్రమాదానికి గురయ్యారు.ఆ ఘటనతో భారతీయ చరిత్ర సుభాష్ చంద్రబోస్ ఆచూకీని కోల్పొయింది.ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.అలాంటి పవర్ ఫుల్ స్టోరీలో దాగి ఉన్న అనేక రహస్యాలను పరిశోధన చేసి రాసుకున్న కధే ఈ ‘స్పై.నేతాజీ ఫైల్స్ ఓ టెర్రరిస్టుకి దొరకడం, వాటిని అతను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించ డంతో .రా ఏజెంట్ అయిన నిఖిల్ దాన్ని ఆపడానికి ఏం చేశారు .తన అన్నయ్య సుభాష్ ఎవరు …అయనకు ఎదురైనా పరిణామాలు ఏంటి అన్నయ్య ఘటనకు తమ్ముడు ప్రతీకారం తీర్చుకున్నారు .చివరికి నేతాజీ మిస్టరీని ఛేదించారా అనేది అసలు కధ .

ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే

Telugu Iswarya Menon, Niitin Mehta, Rana, Spy, Spy Review, Subhaschandra, Tollyw

… నటి పరిస్థితులని వివరిస్తూ .సినిమాని ప్రారంభించిన విధానం ఆకట్టుకునేలా ఉంది .నేతాజీ మరణానికి , నేటి ఘటనలకు లింక్ పెడుతూ అల్లుకున్న సీన్స్ అలరిస్తాయి .పలు సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన గ్యారీ దర్శకుడిగా తానూ తెరకెక్కించిన సినిమాని అంతే థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు .ఖాదిర్ అనే ఉగ్రవాద నాయకుడిని కేంద్రంగా చేసుకుని సినిమా కథని గ్రిప్పింగ్ గా చూపించే ప్రయత్నం బాగుంది .సుభాస్ చంద్రబోస్ డెత్ మిస్టరీ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది చూపించిన విధానం బాగుంది .సుభాష్ చంద్రబోస్ జీవితంలోని రహస్యాల్ని నేపథ్యంగా చేసుకొని తెరకెక్కించిన విధానం బాగుంది .సినిమా మొత్తం నేతాజీ ఫైల్స్ చుట్టూ తిరుగుతు ఆకట్టుకుంటుంది … దీనికి తోడు బ్రదర్ సెంటిమెంట్ ను యాడ్ చేసిన విధానం కూడా బాగుంది .పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్‌గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆకట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది…

ఇక నటీనటుల విషయానికి వస్తే

Telugu Iswarya Menon, Niitin Mehta, Rana, Spy, Spy Review, Subhaschandra, Tollyw

మోడ్రన్ స్పైగా నిఖిల్ ఎనర్జిటిక్ గా కనిపించి మెప్పించాడు .అతడి లుక్, యాక్టింగ్, యాక్షన్ బాగున్నాయి … హీరోయిన్ ఐశ్వర్య మీనన్( Iswarya Menon ) పాత్ర కూడా బాగుంది .ఆమెకి మంచి పాత్ర దక్కిందని చెప్పవచ్చు .ఇక రానా ఎప్పీయరెన్స్ సూపర్ .అలాగే అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నితిన్ మెహతా( Niitin Mehta ) విలన్ గా బాగా చేశాడు .మిగిలిన నటీనటులు తమ పాత్రకి పూర్తి న్యాయం చేశారు ఇక సాంకేతిక విషయాలకు వస్తే .శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది .ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ కలిగిస్తుంది .అలాగే విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి .కెమెరా వర్క్ మెప్పిస్తుంది .ఎడిటింగ్ కూడా బాగుంది .ఈడి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు అలరిస్తాయి .అలాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి మొత్తంగా చుస్తే .స్వాత్యంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు మెండుగా ఉన్నాయి .ఈ చిత్రం నిఖిల్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమని చెప్పవచ్చు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube