సోషల్ మీడియా ఎఫెక్ట్.. ఇంటికెళ్లి మోనాలిసాతో అగ్రిమెంట్ చేసుకున్న డైరెక్టర్ (వీడియో)

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ( Prayag Raj Mahakumbha Mela )రుద్రాక్షలు అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసా, ఇప్పుడు సినిమా ప్రపంచంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతుంది.బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా( Director Sanoj Mishra ) తన తదుపరి చిత్రంలో మోనాలిసాను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

 Social Media Effect Goes Home, Director Agrees With Mona Lisa , Monalisa, Sanoj-TeluguStop.com

ఈ మేరకు, మోనాలిసా కుటుంబాన్ని కలసి, ఆమె తండ్రికి సినిమా పరిశ్రమ గురించి వివరాలు అందించారు.దానితో ఆమె తండ్రి జై సింగ్ భోంస్లే, ( Jai Singh Bhosle )తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అనుమతిచ్చారు.

ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో వీడియో ద్వారా ప్రకటించారు.

మోనాలిసా బాలీవుడ్‌లో నటించే చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’( The Diary of Manipur ).ఈ సినిమాలో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తెగా నటించనున్నారు.ప్రేమకథ, స్థానిక సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించబడుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రం మొత్తం 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతోంది.షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుండగా, మోనాలిసా మాత్రం ఏప్రిల్ నుండి షూటింగ్‌లో పాల్గొననున్నారు.

ఇకపోతే, సనోజ్ మిశ్రా 12 చిత్రాలను తెరకెక్కించిన అనుభవం ఉన్న డైరెక్టర్.ఆయన చేసిన కొన్ని ప్రసిద్ధ చిత్రాలు ‘గాంధీ గిరీ’, ‘ది డైరీ ఆఫ్ బెంగాల్’, ‘కాశీ టూ కాశ్మీర్’, ‘రామ్ కీ జన్మ భూమి’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తారని కూడా సమాచారం.మొత్తానికి మోనాలిసా తన కెరీర్‌ను మరో కొత్త దిశగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

అది ఆమె అభిమానులకు మంచి సర్ప్రైజ్ అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube