ఏపీలో సీఎం వైఎస్ జగన్ ( CM YS Jagan ) పాలనకు మరో అరుదైన గౌరవం దక్కింది.అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్న జగనన్న సుపరిపాలనతో యావత్ దేశంలోనే మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఏపీలో( AP ) ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ప్రజల చెంతకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అరుదైన పురస్కారాన్ని దక్కించుకుంది.
ప్రతి ఊరిలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్లే కాకుండా ఇంటి గడప ముందుకే రేషన్, పెన్షన్ వంటి పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ.ప్రతి ఇంటిలో సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యునిగా మారారు.
ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఏపీ స్టేట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.ఇందులో భాగంగానే ఏపీ గ్రామీణాభివృద్ధి, గృహా నిర్మాణం మరియు రెవెన్యూ శాఖలకు ఈ గౌరవం దక్కింది.
పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక ”స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2023” లో( SKOCH State Of Governance Report – 2023 ) దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది.
గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని చెప్పుకోవచ్చు.పారదర్శకంగా పాలన అందించడమే కాకుండా.ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతో ఏపీ గ్రామీణాభివృద్ధిలో( AP Rural Development ) విజయవంతమైన ఫలితాలను సాధించింది.
అంతేకాదు స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా.సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు.
మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు స్థానాన్ని సంపాదించాయి.