Nara Lokesh : రెడ్ బుక్ చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారు..: లోకేశ్

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేశ్( TDP Nara Lokesh ) శంఖారావం సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ( YCP )పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 Ycp Leaders Are Afraid Of Seeing The Red Book Lokesh-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో అధికారులు నీతి, నిజాయితీతో పని చేయాలని సూచించారు.

రెడ్ బుక్( Red Book ) చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని లోకేశ్ తెలిపారు.

అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ఇచ్చే సలహాలు అన్నీ పనికిమాలిన సలహాలేనని విమర్శించారు.సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయన్న లోకేశ్ తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని ఆరోపణలు చేశారు.దొంగ ఓట్ల వ్యవహారంపై త్వరలోనే విచారణ నివేదిక వస్తుందన్నారు.

ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube