చంద్రయాన్ 3( Chandrayaan 3 ) ప్రాజెక్ట్ సక్సెస్ మన దేశ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.భవిష్యత్తులో భారత్( India ) మరిన్ని సంచలనాలను సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇతర దేశాల మీడియాలు సైతం చంద్రయాన్ 3 కు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చాయి.పాక్ మీడియా(
Pakistan Media ) సైతం చంద్రయాన్3 ప్రాజెక్ట్ కు భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడంతో ఇది కదా నిజమైన గెలుపు అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
చంద్రుని దక్షిణ ధృవంపై( Moon South Pole ) ల్యాండర్ దిగడం ద్వారా అసాధ్యం సుసాధ్యం అయింది.ప్రధాన పత్రికలు పతాక శీర్షికలతో భారత్ గొప్పదనం గురించి ప్రశంసలు కురిపించడం గమనార్హం.
ఈ క్షణాలు మన దేశానికి మహత్తర క్షణాలు అని ప్రముఖ పత్రికలు పేర్కొన్నాయి.న్యూయార్క్ టైమ్స్( Newyork Times ) మన దేశానికి దక్కిన గొప్ప విజయం అని పేర్కొనడం గమనార్హం.

మన దేశానికి ఇది చారిత్రాత్మక విజయమని వాషింగ్టన్ పోస్ట్( Washington Post ) పేర్కొంది.ది వాల్ స్ట్రీట్ జర్నల్( The Wall Street Journal ) చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ద్వారా భారత్ చారిత్రాత్మక ల్యాండింగ్ చేసిందని పేర్కొనడం గమనార్హం.ఈ ఘనత ద్వారా మన దేశం అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం పోటీ పడే దేశాలలో ముందువరసలో ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్షాన్ని వాడుకోవడంలో భారత్ ఘన విజయం సాధించిందని ఐరాస సెక్రటరీ జనరల్ వెల్లడించారు.పాకిస్తాన్ లోని( Pakistan ) ప్రసార మాధ్యమాలు మన దేశ విజయంపై విసృతంగా కవరేజ్ ఇవ్వడం గమనార్హం.కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ( Sonia Gandhi ) ఇస్రోను అభినందిస్తూ లేఖ రాయడం గమనార్హం.చంద్రయాన్ 3 సక్సెస్ తో మరిన్ని ప్రాజెక్ట్ ల దిశగా ఇస్రో( ISRO ) అడుగులు వేస్తుండటం గమనార్హం.చంద్రయాన్3 ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఇస్రో ఉద్యోగులు ఎంతగానో సంతోషిస్తున్నారు.