ఎంతో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని తన అందం అభినయంతో దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగుతున్న నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా,తెలుగులో కూడా నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సందడి చేశారు.
ఇక శిల్పా శెట్టి తాజాగా నటించిన చిత్రం ‘నికమ్మ’.ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా, బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న శిల్పాశెట్టి తాజాగా వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి అమెజాన్ ప్రైమ్‌తో కలిసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే టైటిల్‌తో వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ టీజర్ ఇటీవల రోహిత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ టీజర్ కు మంచి ఆదరణ లభించింది.
ఈ క్రమంలోనే ఈ టీజర్ తో పాటు ఇందులో శిల్పాశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.పోలీస్ డ్రెస్ లో చేతిలో గన్ను పట్టుకుని కనిపిస్తున్నటువంటి శిల్పాశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వెబ్ సిరీస్ లో ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ఎనిమిది భాగాలుగా తెరకెక్కనున్నట్లు వెల్లడించారు.