యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మంచిజోరు మీద ఉన్నాడు.దసరా సందర్భంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తాను చేయబోయే సినిమాని లాంచ్ చేశాడు.
ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుంది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే మరోవైపు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉంచాడు.ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే బై లింగ్వల్ మూవీ ఒకటి చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఇదిలా ఉంటే తన మరో కొత్త సినిమా శ్రీకారం సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసే దశలో ఉన్నాడు.
శర్వానంద్, ప్రియాంకా అరుల్ మోహన్ జంటగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.లాక్‌డౌన్‌కి ముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ ఈ సినిమాని మరల లాక్ డౌన్ సడలింపులతో తిరుపతిలో స్టార్ట్ చేశారు.ఈ నెల 2న తిరుపతిలో షూటింగ్ జరుపుకుంది.
ఇదిలా ఉంటే ఈ షెడ్యుల్ పూర్తయినట్లు చిత్రనిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలు గోపి ఆచంట, రామ్ ఆచంట స్పష్టం చేశారు.వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అందరి సహకారంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా చిత్రీకరణ జరిగిందని తెలిపారు.
త్వరలో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందని, వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని తెలిపారు.షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాని ఒరిజినల్ షార్ట్ ఫిలిం దర్శకుడుతోనే 14 రీల్స్ తెరకెక్కిస్తుంది.