పౌరాణిక పాత్రలు వేసి స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.అయితే తరువాత పూర్తి స్థాయిలో పౌరాణిక పాత్రలని సీనియర్ ఎన్టీఆర్ స్థాయిలో ఇప్పటివరకు ఎవరూ వేయలేదు.
వేసిన కూడా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.అయితే మరల ఆ స్టామినా, డైలాగ్ డెలివరీ అంటూ బాలకృష్ణకి ఉన్నాయి.
బాలయ్య కూడా అప్పుడప్పుడు తనకి ఇష్టమైన పౌరాణిక పాత్రలు వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.బాపు శ్రీరామరాజ్యం సినిమా కోసం తండ్రి తర్వాత శ్రీరాముడు పాత్రలో ఆ స్థాయిలో మెప్పించాడు.
అలాగే రాఘవేంద్రరావు పాండురంగడు సినిమాలో కృష్ణుడుగా కూడా అదే స్థాయిలో మెప్పించాడు.క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణిగా తన రాజసాన్ని బాలయ్యబాబు చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
తండ్రిలాగే పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణకి ఉన్న టాలెంట్ అతన్నీ పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలు వేసేలా ప్రోత్సహిస్తుంది.
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ఒకటి చేస్తున్నాడు.
ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో బాలయ్య కనిపించబోతున్నాడు.ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమాపై ప్రస్తుతం క్లారిటీ వచ్చేసింది.
అతను నెక్స్ట్ విప్లవవీరుడు, కాకతీయుల కాలంలో రుద్రమదేవి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన బందిపోటు దొంగ గోన గన్నారెడ్డి పాత్ర బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు.
బోయపాటి సినిమా తర్వాత గోనగన్నారెడ్డి ఉంటుంది అని స్పష్టత ఇచ్చేశాడు.అయితే ఈ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుంది అనేది త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయని సమాచారం.
గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించి మెప్పించాడు.