తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ నటి ఊర్వశి( Actress Urvashi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లిగా, పిన్నిగా, అక్కగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది.
కాగా ప్రభాస్ నటించిన చక్రం సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.అలాగే సమంత నటించిన బేబీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) మరదలిగా నటించింది.
తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో నటించింది.
ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు తనకు తన కూతురికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.కూతురు కుంజత, కుమారుడు ఇషాన్ ప్రజాపతితో కలిసి ఉన్న ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.ఆ ఫోటోలలో ముఖ్యంగా ఊర్వశి కూతురు తేజ లక్ష్మి ( Teja Lakshmi ) స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.
తను చాలా ముద్దుగా ఎంతో అందంగా కనిపిస్తుంది.
హీరోయిన్స్ కంటే అందంగా ఉంది అంటూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.అంతేకాకుండా త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.మీ కూతురి అందం ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే నటి ఊర్వశి నటుడు మనోజ్ కె.జయన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరికి కూతురు కుంజత జన్మించింది.అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరు 2008లో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత 2013లో ఊర్వశి చెన్నైలోని బిల్డర్ శివప్రసాద్ ను పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు ఇషాన్ జన్మించాడు.