ఆర్ఎక్స్ 100తో హిట్టు కొట్టిన కార్తికేయ.. ఇప్పుడు ఎక్కడున్నాడు?

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ గురించి మనందరికీ తెలిసిందే.మొదట ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించాడు కార్తికేయ.

 No Movie Offers For Hero Karthikeya, Hero Karthikeya,rx 100,tollywood,karthikeya-TeluguStop.com

ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమా తో ఊహించని విధంగా భారీ పాపులారిటీని సంపాదించుకున్నారు.అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆర్ఎక్స్ 100 సినిమా స్థాయిలో హిట్ ను అందుకోలేకపోతున్న హీరో కార్తికేయ.ఇకపోతే ఇటీవలే వలిమై సినిమాతో కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా రూపుదిద్దుకున్నాయి యాక్షన్ మూవీ లో కార్తికేయ విలన్ గా నటించారు.ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన అయి బాక్సాఫీసు వద్ద ఊహించిన విధంగా బోల్తా కొట్టింది.

ఆ తర్వాత తెలుగులో కార్తికేయ చివరగా రాజా విక్రమార్క సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా కూడా అనుకున్న సక్సెస్ ను సాధించలేకపోయింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయి సంవత్సరం కాబోతున్న కూడా హీరో కార్తికేయ నుంచి ఒక సినిమా రాలేదు.

Telugu Rx, Karthikeya, Kollywood, Tollywood, Valimai, Villain-Movie

అంతేకాకుండా సినిమాలకు సంబంధించిన అప్డేట్ కానీ కార్తికేయ కానీ ఎక్కడా కనిపించడం లేదు.వరుసగా ఫ్లాపులు ఎదురవడంతో కెరీర్ కూడా చాలా డౌన్ అయిపోయింది.ప్రస్తుతం కార్తికేయ చేతిలో ఏవో రెండు మూడు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో ప్రశాంత్ చంద్ర దర్శకత్వంలో ఒక మూవీలో చేస్తున్నారట.లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేసేందుకు కార్తికేయ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట.

మరి ఈ రెండు ప్రాజెక్టుల తో కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమా రేంజ్ లో సక్సెస్ ను అందుకు ఉంటాడా లేదా అన్నది చూడాలి మరి.ఇకపోతే ఇటీవలే కార్తికేయ ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.పదకొండేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి లోహితను గత ఏడాది నవంబర్ లో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube