ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.తాజాగా మినిస్టర్ రోజాపై(Minister Roja) టిడిపి నాయకులు బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి.
రోజా నీ* చిత్రాల్లో నటించిందని, రోజా చీకటి వ్యవహారం ఎవరికి తెలియదని, ఒక మహిళా మంత్రిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు టిడిపి నాయకులు సత్యనారాయణ(Bandaru Sathyanarayana).
దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోజా(Roja) మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై స్పందించిన రోజా ప్రెస్ మీట్ పెట్టి మరి కన్నీటి పర్యంతమైంది.అంతేకాకుండా రోజా భర్త సెల్వమణి (Selvamani) కూడా రోజా ఏం తప్పు చేసిందో వీడియోలు, ఫోటోలు ఉంటే బయట పెట్టాలని, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నువ్వు మగాడివైతే అవన్నీ బయటపెట్టి రుజువు చేయాలని సవాల్ విసిరారు.
ఈ విధంగా రోజా తథాంగం నడుస్తున్న తరుణంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక మహిళా మంత్రి , మళ్లీ అధికారంలో ఉన్న పార్టీ మంత్రి అయిన రోజాపై ప్రతిపక్ష నాయకుడైన వ్యక్తి అంతటి మాటలంటే కనీసం వైసిపిలో( YCP ) ఉన్నటువంటి మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది.వైసీపీలో ఇప్పటికే విడదల రజిని(Vidadala Rajini), తానేటి వనిత(Thaneti Vanitha), ఉషశ్రీ చరణ్(Ushasri Charan) వంటి మహిళా మంత్రులు ఉన్నారు.కానీ ఈ విషయంపై మీరు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు.
కేవలం ఏపీ మహిళా కమిషన్ మాత్రమే ఈ అంశంపై కాస్త సీరియస్ అయి, అట్టి టీడీపీ నేతపై ఫిర్యాదు చేసి నోటీసులు ఇచ్చింది తప్ప మీడియా ముఖంగా మిగతా మంత్రులు ఎవరు స్పందించకపోవడం సోచనీయంగా మారింది.
దీంతో మంత్రి రోజా వైసీపీ(YCP) పార్టీలో ఒంటరిదైందంటూ, ఆమెకు ఎవరు సపోర్ట్ చేయడం లేదంటూ రకరకాల కామెంట్లతో వార్తలు వస్తున్నాయి.అయితే రోజాపై(Roja) అన్ని మాట్లాడిన మిగతా వాళ్ళు స్పందించకపోవడానికి ప్రధాన కారణం ఆమె కూడా చాలాసార్లు టిడిపి మహిళా నేతలను, ఇతర నేతలను కూడా అవమానకరంగా మాట్లాడిందని, అందువల్లే ఆమెను టార్గెట్ చేసి టిడిపి(TDP) నాయకులు మాట్లాడారని అంటున్నారు.ఏది ఏమైనా రోజా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.