గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ మేరకు పిటిషన్ పై న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.
దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ( Dasoju Shravan, Kurra Satyanarayana ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundara Rajan ) కు ప్రతిపాదనలు పంపింది.అయితే వాటిని ఆమె తిరస్కరించారు.కాగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదం తెలిపారు.దీంతో వారి నియామకాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై పలు దఫాలుగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.