మనం వెండితెరపై ఎన్ని ప్రేమ కథలు చూస్తూనే ఉన్నాం.కొన్ని కథలని అంత త్వరగా మర్చిపోలేం.
కొన్ని కథలు నిజంగా జరిగినవి కూడా వెండితెరపై కనిపించాయి.ఇప్పుడు ఇండియాలో ఒక లవ్ స్టోరీ వైరల్ అవుతుంది.
తాజాగా ఈ సినిమా ఓటిటిలో కూడా వచ్చేసింది.అదే షేర్ షా( Shershaah Movie ) అనే హిందీ సినిమా.ఈ సినిమాలో సిద్ధార్థ మల్హోత్రా( Siddharth Malhotra ) హీరో, కియరా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటించారు.1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆర్మీ కెప్టెన్ బయోపిక్ ఇది.ఆ కథానాయకుడి పేరు విక్రమ్ బాత్రా.( Vikram Batra ) ఇప్పుడు ఈ విక్రమ్ బాత్రా రియల్ లవ్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
విక్రమ్… హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ఓ పంజాబీ హిందూ.చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీలో ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌లో జాయినయ్యాడు… పంజాబీ డింపుల్ చీమా( Dimple Cheema ) కూడా అదే సంవత్సరం, అదే కోర్సులో జాయిన్ అయ్యింది.
అప్పుడే వీరిద్దరికి పరిచయం అయ్యింది.వీళ్ళు తరచుగా ఒక కేఫ్ లో కూర్చొని మాట్లాడుకునేవారు.ఆ పరిచయం ప్రేమగా మారింది.వీరిద్దరూ మానసాదేవి గుడికి, శ్రీనద సాహెబ్ గురుద్వారాకు వెళ్లేవాళ్లు.
అప్పుడే అందరి ఇళ్లల్లో ఉన్నట్టే వీరి ఇళ్లల్లో పెళ్లి ప్రెషర్ మొదలైంది.అయితే కారణాలు చెప్పుకుంటూ ఇద్దరు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు.
ఒకరోజు విక్రమ్ ఆమెను ఆపి, దుపట్టా అంచు పట్టుకుని, ఏయ్, మిసెస్ బాత్రా, మన పెళ్లయిపోయిందోయ్ అన్నాడు.అప్పుడామె పెళ్లయినట్టేనని ఫిక్స్ అయిపోయింది.మరోసారి ‘మన పెళ్లి మాటేమిటి విక్రమ్, జరుగుతుందంటావా.?’ అనడిగింది… వెంటనే తన వ్యాలెట్‌లో ఉన్న చిన్న బ్లేడ్ తీసి, బొటనవేలు కోసుకుని, ఆ రక్తాన్ని ఆమె పాపిట్లో రాశాడు.హత్తుకున్నాడు.విక్రమ్‌తో పెళ్లయినట్టేననే ఆమె కూడా బలంగా నమ్మింది.

ఆ తరువాత ఇండియన్ మిలిటరీ అకాడమీకి అప్లయ్ చేశాడు.అంతే కాదు సెలెక్ట్ కూడా అయ్యాడు.ఆమె కూడా తన నిర్ణయాన్ని ఆమోదించింది.విక్రమ్ డెహ్రాడూన్‌లో శిక్షణకు వెళ్లిపోయాడు.అదయ్యాక మర్చెంట్ నేవీలో జాబ్ వచ్చింది కానీ పోలేదు.ఇండియన్ ఆర్మీలో( Indian Army ) చేయాలని కదా తన లక్ష్యం.
అనుకున్నట్టుగానే చేరాడు.జమ్ముకాశ్మీర్‌లో డ్యూటీ చేసాడు.
మధ్యమధ్యలో చండీగఢ్ వెళ్లి, డింపుల్‌ను కలిసేవాడు.ఇంట్లో కూడా చెప్పేసాడు.అయితే అప్పుడే కార్గిల్ యుద్ధం వచ్చిపడింది.ఈ యుద్ధం అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.కానీ క్రూషియల్ ఘట్టంలో తన ట్రూప్ సభ్యుల ప్రాణాలు కాపాడే క్రమంలో విక్రమ్ బాత్రా ప్రాణాలు కోల్పోయాడు.

యుద్దానికి వెళ్లే ముందు డింపుల్‌ను ఊరడిస్తూ విక్రమ్ ఓ మాటన్నాడు.ఎందుకు డియర్ ఆందోళన.? తప్పకుండా తిరిగి వస్తాను కదా… మన మూడు రంగుల పతాకాన్ని ఎగరేస్తూ వస్తాను గర్వంగా… లేదంటే ఆ రంగుల పతాకంతో చుట్టబడి తిరిగొస్తాను మరింత గర్వంగా.!యుద్దానికి వెళ్లిన విక్రమ్ విగతజీవుడై తిరిగొచ్చాడు.అప్పుడే తొలిసారిగా డింపుల్‌ను చూశారు విక్రమ్ తల్లిదండ్రులు.జీవితంలో పెళ్లి చేసుకుంటే విక్రమ్‌నే, లేకపోతే ఇక పెళ్లే చేసుకోను అని అదే మాట మీద నిలబడింది.ఇప్పటికి 22 ఏళ్లు అయిపోయాయి.
విక్రమ్ విడోగానే చండీగఢ్‌లో ఒంటరిగా బతుకుతోంది.ఈ కథ విన్న ఇప్పటి తరం వాళ్ళు ఇంత గొప్ప ప్రేమ కథ విన్నందుకు చాల గర్వంగా ఉందని అంటున్నారు.







