ఏపీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.సర్పంచ్ ల నిధులు ప్రభుత్వం దారి మళ్లిస్తోందంటూ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సర్పంచుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిధులు మళ్లించిందని పిటిషనర్ తరపు న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు.ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.







