2023 సంవత్సరంలో అత్యంత భారీ స్థాయిలో లాభాలను అందించిన నాలుగు సినిమాలివే!

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.అయితే కొన్ని సినిమాలు మాత్రం అంచనాలను మించి లాభాలను అందించడంతో పాటు మేకర్స్ కు అదిరిపోయే లాభాలను అందించాయి.

 2023 Year Biggest Profitable Movies Details Here Goes Viral In Social Media , Pr-TeluguStop.com

ఈ సినిమాల జాబితాలో మొత్తం 4 సినిమాలు ఉండటం గమనార్హం.ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ గా నిలిచిన సినిమాలలో బలగం సినిమా( Balagam ) ముందువరసలో ఉంటుంది.

తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్( Priyadarshi, Kavya Kalyan Ram ) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

ఈ సినిమా తర్వాత తక్కువ పెట్టుబడితో తెరకెక్కి భారీగా లాభాలను అందించిన సినిమాల జాబితాలో సామజవరగమన మూవీ( Samajavaragamana movie ) ఉంది.శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.

Telugu Balagam, Priyadarshi, Profitable, Virupaksha-Movie

శ్రీవిష్ణు సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలవడం గమనార్హం.ఈ సినిమా సక్సెస్ తో శ్రీవిష్ణు మార్కెట్ సైతం భారీగా పెరిగింది.ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సినిమాలలో వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) ఒకటి కాగా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వాల్తేరు వీరయ్య సినిమా వల్ల కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందుకున్నారు.

Telugu Balagam, Priyadarshi, Profitable, Virupaksha-Movie

నెగిటివ్ రివ్యూలతో సైతం ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం గమనార్హం.ఈ ఏడాది బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో లాభాలను అందించిన సినిమాలలో విరూపాక్ష ( Virupaksha )ఒకటి.ఎస్వీసీసీ బ్యానర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.మరికొన్ని సినిమాలు కూడా ఈ ఏడాది విడుదలై లాభాలను అందించినా ఈ సినిమాల స్థాయిలో అయితే లాభాలు రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube