మెగాస్టార్, బాలకృష్ణ తమ సినీ కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలలో నటించారు.ఈ ఇద్దరు హీరోల వయస్సు ఆరు పదులు దాటినా ఈ హీరోలు రొటీన్ సినిమాలలోనే నటించారని కామెంట్లు వినిపించాయి.
అయితే ఈ హీరోలు ఇతర స్టార్ హీరోలలా భిన్నమైన కథలను ఎంచుకోవడం లేదని ఫ్యాన్స్ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.కమల్ విక్రమ్ తరహా సినిమాలను చిరు, బాలయ్య చేయాలని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు.
అయితే చిరంజీవి, బాలకృష్ణ కమర్షియల్ సినిమాలలో నటిస్తే మాత్రమే తమ కెరీర్ కు మేలు జరుగుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది.కమర్షియల్ సినిమాలలో నటించడం ద్వారా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చిరంజీవి, బాలయ్య ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
బాలయ్య ప్రతి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండాల్సిందేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి, బాలయ్య తమ పరిధి దాటి సినిమాలు తీస్తే సినిమాలు ఫ్యాన్స్ కు కూడా నచ్చని పరిస్థితి అయితే ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.చిరంజీవి, బాలయ్యలకు కొత్త కథల విషయంలో భయం ఉందని బోగట్టా.ఈ రీజన్ వల్లే చిరంజీవి, బాలయ్య భిన్నమైన నేపథ్యాలను ఎంచుకుంటున్నా ఆ సినిమాలలా ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ కాదని కొంతమంది చెబుతున్నారు.చిరంజీవి ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు ఎక్కువ సందర్భాల్లో నష్టాలను మిగిల్చాయి.ప్రయోగాత్మక సినిమాలు కొన్నిసార్లు అభిమానులకు కూడా నచ్చకపోవచ్చు.నాగార్జున ప్రయోగాలు చేయడం వల్లే ఇబ్బందులు పడుతున్నాడని కొంతమంది చెబుతున్నారు.చిరంజీవి, బాలయ్య సినిమాలలో కథ కంటే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు కమర్షియల్ గా మంచి ఫలితాలనే సొంతం చేసుకున్నాయి.