ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటుంటాయి.విగ్రహాలు నుంచి నీళ్లు రావడం, లేదంటే విగ్రహాలు నీళ్లు తాగడం వంటి వింతల గురించి మీరు వినే ఉంటారు.
అయితే తాజాగా ఆ కోవకు చెందిన ఒక ప్రకృతి వింత ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ వీడియోలో చెట్టు నుంచి నీళ్లు రావడం కనిపించాయి.
ఈ వీడియోను తాజాగా సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 1 కోటి 12 లక్షల వ్యూస్ వచ్చాయి.
నిజానికి ఈ చెట్టు గురించి ఇప్పటికే ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం దాన్నుంచి నీరు ఎంత ఉధృతంగా ఎగిసిపడుతుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.
మోంటెనెగ్రోలోని డైనోసా అనే విచిత్రమైన గ్రామం నడిబొడ్డున, ఈ అసాధారణమైన పురాతన మల్బరీ చెట్టు ఉంది.ఇది పుట్టి ఒకటిన్నర శతాబ్దానికి పైగా కాలం గడిచిపోయింది.ఈ అద్భుతమైన చెట్టు ఒక ప్రత్యేకత కలిగి ఉంది.
అదేంటంటే, ఈ చెట్టులోని మొండెంలో ఏర్పడిన ఒక రంధ్రం 1990ల నుంచి స్థానికులను, సందర్శకులను మంత్రముగ్దులను చేసేలా నీటిని ఎగ జిమ్ముతుంది.అంటే గత 33 ఏళ్లుగా అది ఈ పని చేస్తుంది.
భూగర్భ నీటి ప్రవాహాల నెట్‌వర్క్‌పై పెరిగిన ఈ మల్బరీ చెట్టు సహజ నీటి మార్గంగా పనిచేస్తుంది, దాని ఖాళీ లోపలి భాగం భూగర్భ జలాలకు ప్రెజర్ వాల్వ్‌గా పనిచేస్తుంది.భారీ వర్షాల తర్వాత, భూగర్భ జలాశయాలు ఉబ్బుతాయి.అదనపు నీరు చెట్టు ట్రంక్ నుండి పైకి ఎగసిపడుతుంది.ఈ మనోహరమైన ప్రదర్శన సాధారణంగా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, మల్బరీ చెట్టును మంత్రముగ్ధులను చేసే ఫౌంటెన్‌గా మారుస్తుంది, ఇది ప్రకృతి వింతలకు నిదర్శనం.