కామారెడ్డి జిల్లా ( Kamareddy District ) కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ( Government Hospital ) లో ఎలుకల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఆస్పత్రిలో బీభత్సం సృష్టిస్తున్న ఎలుకలు( Rats) చికిత్స పొందుతున్న రోగులను కరుస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఐసీయూ ( ICU )లో చికిత్స పొందుతున్న షేక్ ముజీబ్ అనే వ్యక్తి చేతిని కరిచినట్లు బంధువులు చెబుతున్నారు.మరి కాసేపటి తరువాత నాలుగైదు ఎలుకలు వచ్చి రోగి ( Patient ) కాళ్లు, చేతులను కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయింది.
అలాగే మరో ఇద్దరు పేషెంట్లను కూడా ఎలుకలు గాయపరిచాయి.దీంతో రోగుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.
అనంతరం దీనిపై డాక్టర్లకు ఫిర్యాదు( Complaint ) చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.ఈ క్రమంలోనే ఎలుకల బారి నుంచి తమకు కాపాడాలని కోరుతున్నారు.