బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమా(Suma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఈమె తన మాట తీరుతోనే ఎంతో ఫేమస్ అయ్యారని చెప్పాలి.ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నటువంటి సుమ బుల్లితెరపై సుమ అడ్డా (Suma Adda) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు హాజరు కావడంతో వారిని చేత సందడి చేయిస్తూ ఉంటారు.ఇక ఈ కార్యక్రమానికి ఎక్కువగా సినిమా ప్రమోషన్ల నిమిత్తం సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా సుమా అడ్డ కార్యక్రమానికి రానా పరేషాన్ (Pareshaan)హాజరయ్యారని తెలుస్తోంది.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి పరేషాన్ నటీనటులు తిరువీర్, ప్రణవి కరణం, డైరెక్టర్ రూపక్ రోనాల్డ్ సన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వీరితో కలిసి పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఎప్పటిలాగే తన ఆటపాటలతో పంచ్ డైలాగులతో అందరిని ఓ ఆట ఆడుకున్న సుమను మాత్రం రానా(Rana) తనదైన స్టైల్ లో సుమని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

ఈ కార్యక్రమంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొదలుకొని రానా సుమపై పంచుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.సుమాకు కనీసం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రానా సెటైర్లు వేయడంతో దెబ్బకు సుమ సైలెంట్ అయ్యారు.వీరంతా కలిసి బాహుబలి (Bahubali) సినిమాలోని శివాలయాన్ని సందర్శించుకుని సన్నివేశాన్ని స్పూఫ్ చేశారని తెలుస్తోంది.
చిత్ర బృందంతో కలిసి ఒక చిన్న బెట్ కట్టారు.ఎవరితో స్నేహం ఎక్కువకాలం ఉంటుందని సుమ అడగడంతో వెంటనే ప్రణవి చిన్ననాటి స్నేహితులతో చేసిన స్నేహం ఎక్కువ కాలం ఉంటుందని చెబుతూ ఆమె రెండు లక్షల బిట్ కట్టారు.
కానీ రానా మాత్రం తప్పు అంటూ 500 రూపాయలు బెట్ కట్టారు.రానా ఇలా 500 బెట్ అని చెప్పడంతో ఇప్పటివరకు ఈ షోలో ఎవరు కూడా 500 ఇవ్వలేదని చెప్పడంతో అయితే ఆ 500 కూడా ఇచ్చేయండి అంటూ మరోసారి సుమపై సెటైర్ వేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.