అప్పుడప్పుడు టాలీవుడ్ లో కొన్ని క్రేజీ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. స్టార్ హీరో, దర్శకుల కాంబినేషన్ గురించి ప్రచారం జరుగుతుంది.
అయితే నిప్పు లేనిదే పొగరాదు అని చాలా మంది భావిస్తారు.అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన వార్త తాజాగా బయటకి వచ్చింది.
మెగా హీరో రామ్ చరణ్, సౌత్ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా ఫైనల్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.శంకర్ మొన్నటి వరకు భారతీయుడు సీక్వెల్ మీద ఉన్నాడు.
అయితే ఆ సినిమా మళ్ళీ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు.కమల్ హాసన్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో భారతీయుడు సీక్వెల్ షూటింగ్ ఆగిపోయింది.
ఈ లోపు శంకర్ మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండే సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
దాని కోసం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ తో అయితే బాగుంటుందని భావించి అతనికి కథ కూడా నేరేట్ చేయడం జరిగిందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్.కథ మొత్తం రామ్ చరణ్ చుట్టూ తిరిగిన కథని నడిపించే మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రకి పవన్ కళ్యాణ్ అయితే బెటర్ అని శంకర్ భావించినట్లు బోగత్తా.ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.
అయితే తెలుగు, హిందీ కోసం రామ్ చరణ్ ని తీసుకొని తమిళ్ కోసం కోలీవుడ్ స్టార్ హీరోని మెయిన్ లీడ్ పాత్రకి తీసుకోవాలని భావించినట్లు చెప్పుకుంటున్నారు.మరి ఈ వార్తలలో నిజమెంత అనేది తెలియాలంటే ఆఫీహిష్యల్ గా వారి నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.