కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ హీరో తమిళ ప్రేక్షకుల వరకు మాత్రమే కాదు.
తెలుగు, ఇతర భాషల్లో కూడా సూపర్ ఫేమస్ అయ్యాడు.జపాన్లో ఈ హీరోకి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు.
రజనీకాంత్ వయసు ఇప్పుడు 73 ఏళ్లు.అయినా అతడు ఇప్పటికీ డైనమిక్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
ఆయనకు 50 ఏళ్ల వయసు అన్నా నమ్మేలా ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నాడు.ఇప్పటికీ ఈ సీనియర్ హీరో( Senior Hero ) సింగిల్ గా హిట్ కొడుతున్నాడు.
రికార్డులను కూడా క్రియేట్ చేస్తున్నాడు.
జైలర్ మూవీ( Jailer Movie ) తో రజనీ సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.దీంతో 70 ఏళ్ల వయసులో రజనీ కబ్బాకి ఇచ్చినట్లయింది.అయితే ఇప్పుడు రజనీ “లాల్ సలాం” సినిమాలో ఒక అతిధి పాత్ర చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో, అలానే బయట ఎక్కడా కూడా పెద్దగా హైప్ కనిపించడం లేదు.కనీసం రజనీ వీరాభిమానులు కూడా ఈ మూవీ గురించి ఎలాంటి ప్రచారాలు చేయడం లేదు.
దీన్ని బట్టి దానిని ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది .ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒకటి రూపొందుతోందని, త్వరలో రిలీజ్ కాబోతోందని చాలామందికి తెలియనట్లుంది.ట్రేడ్ పరంగా కూడా ఈ మూవీ ప్రీ బిజినెస్ జరగడం లేదని సమాచారం.ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా( Sports Drama )గా ఈ ఏడాది ఫిబ్రవరి 9న వస్తోంది.
అయినా ఇప్పటికీ లాల్ సలాం( Lal Salaam) ప్రమోషనల్ ఈవెంట్స్ జోరు ఎక్కడా కనిపించడం లేదు.
విష్ణు విశాల్( Vishnu Vishal ), విక్రాంత్ సంతోష్ హీరోలుగా ఈ సినిమాలో నటించారు.రజనీ ఓ చిన్న రోల్ లో అలరించనున్నాడు.రజనీ ముద్దుల పుత్రిక ఐశ్వర్య( Aishwarya Rajinikanth ) ఈ సినిమాని డైరెక్ట్ చేసింది.
సాధారణంగా కూతురు తన స్టార్ హీరో తండ్రి సినిమా డైరెక్టర్ చేస్తుందంటే ఆ మూవీకి ఆటోమేటిక్గా బీభత్సమైన హైప్ వస్తుంది.అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి.
ఉదాహరణకి చిరంజీవి నటించిన సినిమాని కూతురు డైరెక్ట్ చేస్తుందంటే టాలీవుడ్ ప్రేక్షకులు( Tollywood Audiance ) ఎలాంటి హడావుడి సృష్టిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ తమిళనాడులో మాత్రం రజనీకాంత్ కూతురు ఐశ్వర్య విషయంలో దానికి విరుద్ధంగా జరుగుతుంది.వీరాభిమానులు కూడా కనీసం బజ్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
దీనివల్ల ఐశ్వర్య బాగా డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.అంతే కాదు రజనీకాంత్ కూడా ఫీలవుతున్నట్లు సమాచారం.