యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ ఇటీవల భార్య జీవిత తో కలిసి ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ సందర్భంగా రాజశేఖర్ తన పాత ప్రేమ కథను తెలియజేశాడు.
జీవితను కలవక ముందు, నా కాలేజ్ డేస్ లో ఒక ప్రేమ కథ ఉండేది.అది వన్ సైడ్ ప్రేమకథ.
నా కంటే ఆమె 5 ఏళ్ళు పెద్ద.అయినా కూడా నేను ఆమెను చాలా లవ్ చేశాను.
కానీ ఆమె మాత్రం లవ్ కు ఒప్పుకోలేదు.
నన్ను ప్రేమించమని ఆమెను ఎంతగానో బతిమిలాడేవాడిని.
ఈ విషయం చివరకు మా కుటుంబ పెద్దల వరకు కూడా వెళ్ళింది.వారు ఈ విషయంలో మాట్లాడి నాకు బుద్ధి చెప్పారు.
నాప్రేమ కథకు సాయం చేయమంటూ దేవుడిని కూడా వేడుకున్నాను.నేను పెద్దగా దేవుడిని నమ్మను.
అయినా కూడా ఒక సారి గుడికి వెళ్లాను.ఆ సమయంలో తాగి ఉన్నాను.
విషయం దేవుడి ముందు చెప్పి నా ప్రేమకు సాయం చేయమని కోరాను అన్నాడు.

తాగి వచ్చిందండుకు క్షమించు అని కూడా దేవుడిని అడిగాను.నాజీవితంలో అది ఒక మరపురాని ప్రేమ కథ అంటూ రాజశేఖర్ పక్కన జీవిత ఉండగానే చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు.తాగి గుడికి వెళ్లాను అంటూ రాజశేఖర్ ఇప్పుడు చెప్పడం తీవ్ర విమర్శలకు తెర తీసినట్లయ్యింది.
హిందూ సంఘాల వారు ఇప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తే పరిస్థితి ఏంటి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.