సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు నీళ్లు మాత్రమే కింద పడతాయి.ఒక్కోసారి వడగళ్ల వాన కూడా కురుస్తుంది.
మరోసారి క్లిస్టర్ క్లియర్ వాటర్‌కి బదులుగా రంగు నీళ్ళు ఆకాశం నుంచి జారి పడుతుంటాయి.ఇలాంటి అరుదైన సంఘటనలు ప్రజలను ఎంతో ఆశ్చర్యపరుస్తుంటాయి.
అయితే తాజాగా చైనాలో ఏకంగా పురుగుల వర్షం కురిసింది.పురుగుల వర్షం(Worms rain) ఎలా కురుస్తుందని ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది.
చైనాలోని బీజింగ్(Beijing)లో పురుగుల వర్షం కురుస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో రోడ్ల పక్కన పార్క్ చేసిన కార్లపై మురికి గోధుమ రంగు జీవులు, పురుగుల మొత్తం పడిపోయే ఉండటం మీరు గమనించవచ్చు.
ఈ పురుగులన్నిటినీ చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోంది.ఈ పురుగులు తమ ఒంటిపై పడకుండా చైనీయులు గొడుగులు వేసుకొని వెళ్తున్నారు.నిజానికి చైనా వాళ్లు దాదాపు అన్ని పురుగులను తినేస్తుంటారు.అందుకే వీరు వీటిని చూసినా పెద్దగా భయపడటం లేదు.
కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం హడలిపోతున్నారు.
అయితే ఈ పురుగులు వంటిపై పడితే చిరాకు వస్తుంది కాబట్టి చైనా ప్రజలు(China) తమను తాము రక్షించుకోవడానికి గొడుగులను వేసుకొని పురుగుల వర్షంలోనే తెలియజేస్తున్నారు.ఈ వర్షం ఎందుకు సంభవించిందో ఇంకా తెలియదు.అయితే మదర్ నేచర్ నెట్‌వర్క్ అనే సైంటిఫిక్ జర్నల్, భారీ గాలుల వల్ల బురద జీవులు కొట్టుకుపోయి నగరంపైకి పడిపోయాయని పేర్కొంది.
తుఫాను తర్వాత కీటకాలు సుడిగుండంలో చిక్కుకొని అవి చైనాలోని బీజింగ్‌లో వానగా కురిసాయి.అయితే, షెన్ షివే అనే చైనా జర్నలిస్ట్ వీడియో ఫేక్ అని, బీజింగ్‌లో ఇటీవల వర్షాలు పడలేదని పేర్కొన్నారు.
ఈ సంఘటన విచిత్రమైనది, కొందరికి సంబంధించినది కావచ్చు, కానీ అసాధారణ వాతావరణ సంఘటనలు జరగడం కొత్తేమీ కాదు.