సీనియర్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గత కొన్నిరోజులుగా అటు నరేష్ పై ఇటు పవిత్ర లోకేష్ పై సంచలన ఆరోపణలు చేయడం ద్వారా రమ్య రఘుపతి వార్తల్లో నిలిచారు.
అయితే కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కు ఈమె అక్క అవుతారని సమాచారం.
ప్రశాంత్ నీల్ అభిమానులు ఈ విషయం గురించి తెలిసి షాక్ అవుతున్నారు.
రమ్య రఘుపతి సొంతూరు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిరలోని మణికంఠపురం అని రమ్య ఫ్యామిలీకి బెంగళూరులో స్టార్ హోటల్ ఉందని బోగట్టా.రఘువీరా రెడ్డి, రమ్య రఘుపతి తండ్రి అన్నాదమ్ములు అని సమాచారం అందుతోంది.
రమ్య తండ్రి ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారని తెలుస్తోంది.
చాలా సంవత్సరాల క్రితం సీనియర్ నరేష్ రమ్య రఘుపతిల వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత చాలా కాలం పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయినట్టు సమాచారం అందుతోంది.అయితే నరేష్ విడాకులు కోరుతున్నా రమ్య రఘుపతి మాత్రం విడాకులు ఇవ్వడానికి అంగీకరించడం లేదు.
సీనియర్ నరేష్ తల్లి విజయనిర్మలకు తాను మాటిచ్చానని అందువల్ల నేను విడాకులు ఇవ్వలేనని ఆమె చెబుతుండటం గమనార్హం.
అదే సమయంలో డ్రైవర్ తో రమ్య రఘుపతికి ఎఫైర్ ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.సీనియర్ నరేష్ రమ్య రఘుపతి గురించి ఈ సంచలన ఆరోపణలు చేశారు.అయితే రమ్య రఘుపతి నుంచి ఈ ఆరోపణలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
రమ్య రఘుపతి బెంగళూరు మీడియా ముందు చేసిన కామెంట్ల విషయంలో పవిత్ర లోకేశ్ సైతం హర్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే.