ఈరోజుల్లో వంటి ఒక చిన్న సినిమా తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మారుతి ఆ తర్వాత చాలా సినిమా లను చేశాడు.అందులో ఎక్కువ శాతం బూతు సినిమా లు ఉన్నాయి.
బూతు సినిమా లను తెరకెక్కించడం మాత్రమే కాకుండా ఆ బూతు సినిమా లను సమర్పించడం వల్ల ఈయన బూతు చిత్రాల దర్శకుడిగా పేరు పడిపోయాడు.కాని ఎప్పుడైతే భలే భలే మగాడివోయ్ మరియు మహానుభావుడు వంటి సినిమా లు చేశాడో అప్పటి నుండి ఈయన పై పెద్ద హీరోల దృష్టి పడింది.
అంతే కాకుండా ఈయన దర్శకత్వంలో సినిమా లు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపించడం మరియు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఈయన్ను ఒక మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ సినిమా లు చేసే పక్కా కమర్షియల్ డైరెక్టర్ అనే పేరు ను దక్కించుకున్నాడు.ఇటీవలే ఈయన గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా ను తీసుకు వచ్చాడు.
సినిమా టైటిల్ కు తగ్గట్లుగానే ఆకట్టుకునే విధంగా ఉంది అంటూ టాక్ వచ్చింది.సినిమాకు వచ్చిన టాక్ తో పని లేకుండా చిరంజీవి ఇప్పటికే మారుతి తో సినిమా ను చేసేందుకు ఓకే చెప్పాడు.
మంచి కథను రెడీ చేస్తే యూవీ వారి బ్యానర్ లో మారుతి దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు తాను రెడీ అన్నట్లుగా చిరంజీవి అధికారికంగా ప్రకటించాడు.మారుతి త్వరలోనే ప్రభాస్ తో కూడా ఒక సినిమా ను చేయబోతున్నాడు.
రాజా డీలక్స్ వంటి కమర్షియల్ సినిమా ను చేయబోతున్నట్లుగా మారుతి చెప్పుకొచ్చాడు.వరుసగా పెద్ద హీరోల తో సినిమా లు చేస్తున్న మారుతి ఎప్పుడు తన స్నేహితుడి తో సినిమా ను చేస్తాడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
మారుతి కి అల్లు అర్జున్ కు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉంది.ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టక ముందు నుండే స్నేహితులు.
ఇద్దరు కూడా యానిమేషన్ ఇన్సిస్టూట్ లో విద్యార్థులుగా ఉన్న సమయంలో స్నేహితులు.అలా ఇద్దరి మద్య ఏర్పడిన స్నేహం వల్లే మారుతి ఇండస్ట్రీ లో ఈ పరిస్థితుల్లో ఉన్నాడు.
అలాంటి స్నేహితుడు బన్నీ ని మారుతి డేట్లు అడిగితే ఎప్పుడు అయినా ఇస్తాడు.కాని మారుతి మాత్రం ఇప్పటి వరకు బన్నీ తో సినిమా ను చేసేందుకు ప్రయత్నించినట్లుగా లేదు.
రాజా డీలక్స్ మరియు మెగా స్టార్ లతో సినిమా తర్వాత ఖచ్చితంగా బన్నీ తో మారుతి సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.