పవన్ కళ్యాణ్ కు నా స్పెషల్ రిక్వెస్ట్ : కేఏ పాల్ 

త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) సైతం దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.మొన్నటివరకు తెలంగాణలో హడావుడిచేసిన కేఏ పాల్ బీఆర్ఎస్ , కాంగ్రెస్,  బిజెపిలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు .

 Praja Shanti Party Ka Paul Special Request To Pawan Kalyan Details, Ka Paul, Pra-TeluguStop.com

అయితే రాజకీయంగా కేఏ పాల్ చేసే విమర్శలను ఏ పార్టీ అంత సీరియస్ గా అయితే పట్టించుకోవడం లేదు.అక్కడ ఎన్నికల తంతు ముగియడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలపై( AP Politics ) ఆయన పూర్తిగా దృష్టి సారించారు.

గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలపై పదేపదే పాల్ స్పందిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ( Praja Shanti Party ) తరఫున అభ్యర్థులను పోటీకి దింపే ఆలోచనతో ఉంటూనే తమ పార్టీలో చేరాల్సిందిగా పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) రిక్వెస్ట్ చేస్తూనే.

సీఎం పదవిని కూడా ఆఫర్ చేస్తున్నారు.టీడీపీ తో పొత్తు రద్దు చేసుకుని  తమ పార్టీతో కలిస్తే ముఖ్యమంత్రి చేస్తాను అంటూ  పవన్ కళ్యాణ్ కు ఆఫర్లు ఇస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Congress, Jagan, Ka Paul, Pavan Kalyan, Prajasanthi, Tdp

తాజాగా ఏపీ పర్యటనలో ఉన్న  కేంద్ర ఎన్నికల బృందాన్ని ఆయన కలిశారు .ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి అనేక సూచనలు చేశారు ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు ,( Chandrababu Naidu ) పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ఎన్నికలు చివరి దశలో పెట్టాలని , అలాగే పోలింగ్ రోజే ఫలితాలు కూడా వెల్లడించాలని సీఈసీ ని కోరినట్లుగా పేర్కొన్నారు .కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుందని,  కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Telugu Ap, Chandrababu, Congress, Jagan, Ka Paul, Pavan Kalyan, Prajasanthi, Tdp

ఈ సందర్భంగా చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు .కాపులు అందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు.అలాగే వంగవీటి రంగా ను చంపిన పార్టీతో కలవవద్దని,  ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కేఏ పాల్ పేర్కొన్నారు .తనపై శత్రువులు విష ప్రయోగం చేసినా, దేవుని కృప,  వైద్యుల సహాయం తనను రక్షించాయంటూ కే ఏ పాల్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube